OTT Movie : క్లయింట్ తోనే ప్రేమలో పడే ప్రొఫెషనల్ కిల్లర్… తెలుగులోనే ఈ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

OTT Movie : సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకంగా మూవీ లవర్స్ ఉంటారు. అందులో ఉండే యాక్షన్ సన్నివేశాలతో పాటు రొమాన్స్, సస్పెన్స్ వంటి అంశాలతో థ్రిల్ ఫీల్ అవ్వడం అంటే వాళ్లకు చాలా ఇష్టం. ఈ జానర్ లో ఉండే సినిమాల కోసం వెతికి వెతికి వేసారిపోతుంటారు. ఇక వీకెండ్ కాస్తా వెతకడానికే సరిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఓటీటీలు, అందులో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ ల సంఖ్య ఆ రేంజ్ లో ఉంటుంది మరి. అలాంటి వాళ్ల కోసమే ఈ మూవీ సజెషన్. ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో పాటు క్రైమ్, రొ*మాన్స్ కూడా ఉంటుంది. క్లైంట్ తోనే ప్రేమలో పడే ప్రొఫెషనల్ కిల్లర్ గురించి ఈ మూవీలో తెలుసుకోబోతున్నాం. ఇక అసలు విషయంలోకి వస్తే ఈ మూవీ పేరు హిట్ మాన్. అయితే ఈ మూవీ సూపర్ మాన్, ఐరన్ మాన్ లాంటిది సూపర్ హీరోల సినిమా మాత్రం కాదు. వినడానికి అలాగే ఉన్నా కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఐఎమ్డిబి లో 7.4 రేటింగ్ దక్కింది అంటే స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఈ వీకెండ్ సరదాగా ఓటీటీలో రొమాంటిక్ సినిమాలు చూడాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Hit Man: Cast, Release Date, Trailer and Plot of Glen Powell Richard  Linklater Movie - Netflix Tudum

- Advertisement -

స్టోరీ ఏంటంటే..

గ్యారీ జాన్సన్ అనే వ్యక్తి ప్రొఫెషనల్ కిల్లర్ గా పని చేస్తూ ఉంటాడు. ఎవరైనా డబ్బులు ఇచ్చి అతని చేత చంపాలి అనుకున్న వాళ్ళను చంపవచ్చు అన్నమాట. అనుమానం రాకుండా, పట్టుబడకుండా తనకు డబ్బులిచ్చిన క్లయింట్ ల డిమాండ్ మేరకు మనుషుల్ని చంపేస్తాడు. ఇక ఎంతో మందిని చంపి ప్రొఫెషనల్ అనిపించుకున్న ఈ కిల్లర్ ఒక మహిళ కోసం తన రూల్స్ అన్నిటిని బ్రేక్ చేయాలనుకుంటాడు.

పెళ్లి చేసుకున్న భార్యను వేధింపులకు గురి చేస్తున్న ఓ భర్తను చంపేసి ఆమెకు సహాయం చేయాలని అనుకుంటాడు. దాని కోసం ప్రోటోకాల్స్ ను బ్రేక్ చేయడానికి కూడా రెడీ అవుతాడు. అయితే ఈనేపథ్యంలోనే గ్యారీ ఆమె భర్తను చంపడం అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఆమెతో ప్రేమలో పడతాడు. మరి చివరికి గ్యారీ అతన్ని చంపేశాడా? ఆ అమ్మాయి ఎవరు అసలు ? గ్యారీ ప్రేమను ఆమె యాక్సెప్ట్ చేసిందా? ఆమె కోసం ఈ ప్రొఫెషనల్ కిల్లర్ ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి అనుకుంటాడు ? అసలు ఆమెతో ఎలా పరిచయం ఏర్పడుతుంది ? చివరకు గ్యారి ప్రేమ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనే విషయాలు తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ మ్యాన్ మూవీని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు