OTT Movie : సైలెంట్ గా ఓటిటిలోకి హెబ్బా పటేల్ రొమాంటిక్ మూవీ… ఏ ఓటిటీలో ఉందంటే?

OTT Movie : ఓటిటిలో ఎప్పటికప్పుడు ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ప్రతి వారం రిలీజ్ అవుతున్న సినిమాలలో తెలుగు మూవీస్ కూడా ఉంటున్నాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రం ముందుగా ఎలాంటి హడావిడి చేయకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన ఓ కొత్త రొమాంటిక్ మూవీ. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పక్కా తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ. పైగా ఇందులో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించడం విశేషం. హీరోగా 20 వెడ్స్ 30 ఫేమ్ చైతన్య రావు హీరోగా నటించారు. ఈ ఏడాది జూన్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వెండితెరపై పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో మాత్రం ఈ మూవీ 8.7 రేటింగ్ తెచ్చుకోవడం మరో విశేషం. ఇలాంటి ఈ సినిమా ఎలాంటి సందడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఓ మంచి రొమాంటిక్ కామెడీ మూవీ ని చూడాలనుకునే వారికి ఈ వీకెండ్ ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

Honeymoon Express review. Honeymoon Express Telugu movie review, story, rating - IndiaGlitz.com

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో ప్రతి ప్రేమ జంట మధ్య ఉండే సమస్యలను ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఈ సినిమా మొదట్లో హీరో హీరోయిన్లు ఇద్దరూ మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. కౌన్సెలింగ్ కు కూడా వెళతారు. ఇదంతా చూసిన ఓ వృద్ధ జంట ఈ జంటను హనీమూన్ రిసార్ట్ కు వెళ్ళమని సలహా ఇస్తారు. దీంతో ఇద్దరు కలిసి హనీమూన్ రిసార్ట్ కు ప్రయాణమవుతారు. అక్కడకు వెళ్ళాక ఏం జరిగింది? మరి ఆ ఓల్డ్ కపుల్ న్యూ కపుల్ ని ఎందుకు హనీమూన్ రీసార్టుకు వెళ్ళమని సలహా ఇచ్చారు? అక్కడికి వెళ్ళాక వీరిద్దరి మధ్య సమస్యలన్నీ సమసి పోతాయా? గతంలో లాగే ఇద్దరి మధ్య ప్రేమ మళ్ళీ చిగురిస్తుందా? చివరికి వీళ్ళిద్దరూ కలిసే ఉంటారా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఈ తెలుగు సినిమాను చూడాల్సిందే. థియేటర్లలో కొన్ని సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఓటిటిలో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. అలాంటి సినిమాల లిస్టులో హనీమూన్ ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. పైగా ఇందులో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ కోసమైనా హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీని ఒకసారి చూడవచ్చు. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాను డోంట్ మిస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు