OTT Movie : ప్రేమించిన అబ్బాయి వేశ్య అని తెలిస్తే… ఓటిటీని ఊపేస్తున్న బో*ల్డ్ మూవీ

OTT Movie : టైటిల్ ని చూసి ఇదొక బోల్డ్ మూవీ అనుకున్నారేమో. అస్సలు కాదు మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఫీల్ గుడ్ మూవీ. యూత్ కు నచ్చేలా ఉన్న ఈ ఫీల్ గుడ్ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ నిజానికి ఒక ఆంథలజీ మూవీ. విగ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మొత్తం ఐదు స్టోరీలు ఉంటాయి. ప్రతి కథకు ఓ ట్విస్ట్ ఉంటుంది. ఈ మూవీ ప్రస్తుతం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంలో అందుబాటులో ఉంది. హాట్ సస్పాట్ అనే ఈ మూవీని తెలుగులో కావాలంటే ఆహాలో చూడొచ్చు.

కథలోకి వెళ్తే…

ముందుగా మహమ్మద్ స్టోరీని చూపిస్తారు. డైరెక్టర్ కావాలనే కలతో ఓ నిర్మాతకు కథ చెప్పడానికి వెళ్తాడు. అతని దగ్గర నాలుగు స్టోరీలు ఉన్నాయని చెప్పి ఫస్ట్ స్టోరీ మొదలు పెడతాడు. ఆ స్టోరీ పేరు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అందులో విజయ్, ధన్య జంట పెద్దలను ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ స్టోరీ మొత్తం రివర్స్ లో నడుస్తుంది. ఇందులో హీరోకి హీరోయిన్ తాళి కడుతుంది. ఆ తర్వాత తన తల్లిదండ్రులను వదిలేసి హీరో హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. అచ్చం జంబలకడి పంబలాగా ఉంటుంది ఈ స్టోరీ. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అనేది తెలియాలంటే హాట్ స్పాట్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

మరో స్టోరీ గోల్డెన్ రూల్స్…

ఇందులో హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటారు. ముందుగా ఆమె తల్లిదండ్రులకు తాను లెస్బియన్ అని చెప్తుంది. తరువాత తాను అమ్మాయిని కాకుండా అబ్బాయిని పెళ్లాడబోతున్నాను అని చెప్పడంతో ఈ పెళ్లికి తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ అంతలోపే ఈ జంట ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్తుంది. ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. పెద్దలు కూడా అడ్డు చెప్పలేదు. మరి అలాంటప్పుడు ఈ జంట ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

- Advertisement -

Hot Spot (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

తక్కాలి చట్నీ…

ఈ మూడో స్టోరీలో హీరో హీరోయిన్లు ఇద్దరు ప్రేమలో ఉంటారు. అయితే ఇందులో హీరోయిన్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తుంది. మరోవైపు హీరో ఉద్యోగం పోవడంతో హీరోయిన్ కు చెప్పకుండా వేరే ఉద్యోగం ఏదైనా చూసుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ అనుకోకుండా వేశ్యగా మారతాడు. కావలసినంత డబ్బు చేతికి అందుతుండడంతో అదే పని చేస్తూ ఓ రోజు తన గర్ల్ ఫ్రెండ్ కు దొరికిపోతాడు. మరి ఆ తర్వాత హీరోయిన్ ఏం చేసింది? అనేది తెలియాలంటే ఈ సినిమాపై ఓ లుక్కెయ్యాల్సిందే.

గేమ్ ఫేమ్…

నాలుగో స్టోరీలో హీరోయిన్ భర్తకు ఇష్టం లేకపోయినా కూతుర్ని చైల్డ్ ఆర్టిస్టుగా మారుస్తుంది. ఆ పాప వల్ల పేదరికం నుంచి బయటపడతారు. కానీ ఒకానొక సమయంలో ఆ పాపను రేప్ చేసి చంపేస్తారు. దీంతో లైఫ్ మొత్తం తలకిందులు అవుతుంది. ఇన్ని స్టోరీలు విన్న నిర్మాత సినిమా చేయడానికి ఒప్పుకున్నాడా? అనే విషయం తెలియాలంటే సినిమాను పూర్తిగా చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు