OTT Movie : కొడుకు మాయం, భర్తను హతం చేసి భార్యను ఇరికించే మాయ ఇల్లు.. 25 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం కొరియన్ సినిమాలు వెబ్ సిరీస్ లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కుతోంది. ఓటిటిలో రిలీజ్ అయ్యే కొరియన్ కంటెంట్ కు తెలుగు మూవీ లవర్స్ నుంచి కూడా విశేష ఆదరణ లభిస్తుంది. దీన్నే క్యాష్ చేసుకుంటున్నాయి పలు ఓటిటి సంస్థలు. అమెజాన్ మినీ టీవీ అయితే కొన్ని కొరియన్ సిరీస్ లను ఫ్రీగానే అందిస్తోంది. పైగా ఆయా భాషల ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా డబ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కొరియన్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అదొక మాయ ఇంటికి సంబంధించిన మూవీ. ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? టైటిల్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మన మాట్లాడుకుంటున్న మూవీ పేరు హౌస్ ఆఫ్ ది డిసపియర్డ్. ఏడేళ్ల క్రితం కొరియన్ థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చి యూనివర్సల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ కొరియన్ లాంగ్వేజ్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాకు లింబ్ డి ఉంగ్ దర్శకత్వం వహించగా, యుంజిన్ కిన్, కే పాప్ స్టార్ ఓకే టైక్ ఇయాన్, జా జై యున్, పార్క్ సంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. రిత్మికల్ గ్రీన్, జియాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

House Of The Disappeared (2017) Tamil Dubbed Korean Movie HD 720p Watch Online – www.TamilYogi.show - Tamil HD Movies - தமிழ் யோகி www.TamilYogi.show – Tamil HD Movies – தமிழ் யோகிకథలోకి వెళ్తే…

హీరోయిన్ కళ్ళు తెరిచి చూడగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తాడు. కత్తి పట్టుకుని అతని దగ్గరకు వెళ్లి బ్రతికి ఉన్నాడా లేదా అని చూస్తుంది. కానీ అతనేమో సడన్గా ఈ అమ్మాయిని పట్టుకునే సరికి బెదిరి పోతుంది. అప్పటికే తీవ్ర గాయాలతో కోన ఊపిరితో ఉన్న అతని కడుపులో అనుకోకుండా ఆమె చేతిలో ఉన్న కత్తి గుచ్చుకుంటుంది.. మరోవైపు ఆమె కొడుకు కనిపిస్తాడు. హీరోయిన్ అతన్ని తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. అబ్బాయి ఒక అడుగు ముందుకు వేసే లోపే ఊహించని విధంగా ఆ డోర్ అతన్ని లాగేసుకుంటుంది. హీరోయిన్ అక్కడికి వెళ్లి చూస్తే గోడ తప్ప ఏమీ కనిపించదు. ఆ తర్వాత పోలీసులు ఎంటర్ అవుతారు. ఆమెనే హత్య చేసిందని, తప్పుడు ఆరోపణలతో హీరోయిన్ ను 25 ఏళ్ల పాటు జైల్లో వేస్తారు. అయితే 25 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన హీరోయిన్ తన భర్త చావుకు కారణం ఏంటో, ఆ మాయ డోర్ రహస్యం ఏంటో కనుక్కోవడానికి ప్రయత్నం మొదలుపెడుతుంది. కానీ ఇంట్లో అడుగుపెట్టగానే ఆ డోర్ దడ దడ కొట్టుకోవడం వంటి వింత సంఘటనల వల్ల ఆమె భయపడుతుంది. మరి తన భర్తను ఎవరు చంపారు? మాయమైన కొడుకు తిరిగి వచ్చాడా? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? అనే విషయాలకు సమాధానం తెలియాలంటే హౌస్ ఆఫ్ ది డిసపియర్డ్ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు