OTT Movie : అవి అమ్మాయిలా ఆడ పిశాచాలా? వర్షాకాలంలో వేడిని పుట్టించే బో*ల్డ్ మూవీ

OTT Movie : ఇప్పటిదాకా మనం ఎన్నో బోల్డ్ మూవీల గురించి చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ మాత్రం ఇవి అమ్మాయిలా ఆడ పిశాచాలా అన్నట్టుగా ఉంటుంది స్టోరీ. మరి ఈ అమ్మాయిలు చేసే అరాచకాన్ని ఏ ఓటీటీలో చూడొచ్చు? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు…

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని ఫ్రీగా చూసే అవకాశం అస్సలు లేదు. ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటిటిలలో అందుబాటులో ఉంది. లైన్స్ గేట్ అనే ఓటిటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియన్స్ కి అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీని చూడాలంటే రెంట్ కట్టాల్సిందే. రూ. 69 కట్టి ఈ సినిమాను చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. కాగా ఈ మూవీ అమ్మాయిలు అబ్బాయిలను చీటింగ్ చేయడం గురించి ఉంటుంది. అందాలను ఎరగా చూపి అమాంతం ఆస్తులు రాయించుకునే రకం ఈ అమ్మాయిలు. అయితే బో*ల్డ్ మూవీ కాబట్టి సింగిల్ గా చూస్తే బెటర్. ఈ మూవీ పేరు హస్లెర్స్.

Hustlers 2019 movie: Costume designer on how he created mid-2000s style -  Vox

- Advertisement -

కథలోకి వెళ్తే…

అమ్మాయి అబ్బాయిని ప్రేమ పేరుతో నిండా ముంచింది అనే వార్తను సాధారణంగా మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. ఈ డైరెక్టర్ కి అదే లైన్ బాగా నచ్చినట్టుగా ఉంది. అయితే ఒక్క అమ్మాయిని కాదు ఏకంగా నలుగురు ఆడవాళ్లను పెట్టి సినిమా తీశాడు. స్టోరీ ఏంటంటే నలుగురు అమ్మాయిలు కుటుంబ భారంతో పోల్ డాన్సర్లుగా మారతారు. కుటుంబాన్ని పోసించడానికి ఈ కెరీర్ ను ప్రారంభించిన వీళ్ళకు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ లాగా, అబ్బాయిలను అట్రాక్ట్ చేసి ఆ సు*ఖాన్ని ఇవ్వడం దాకా వెళ్తుంది స్టోరీ. అయితే శరీరాన్ని ఉపయోగించి సంపాదించినప్పటికీ చేతికి అందే ఆదాయం మాత్రం వాళ్లను నిరాశ పరుస్తుంది. అందులోనూ క్లబ్ ఓనర్ వీళ్ళ ఆదాయాన్ని లాగేసుకుని కూలీల్లా రోజుకు ఎంతో కొంత పడేస్తారు. ఇదంతా చూసాక ఆ అమ్మాయిలకి విరక్తి పుట్టి ఊహించని ప్లాన్ చేస్తారు. మన ఒళ్ళు అమ్ముకుని సంపాదిస్తుంటే ఎవడో మనకు కూలిగా పడేసేదేంటి మనమే సంపాదిద్దాం అనుకుని కొత్త స్టోరీ మొదలు పెడతారు. అక్కడికి వచ్చే బిగ్ షాట్స్ ను టార్గెట్ చేసి ముందుగా మందు తాగించి ఆ తర్వాత పూర్తిగా వాళ్ళను లూటీ చేస్తారు. వాళ్ల దగ్గర ఏమున్నా సరే లాగేసుకోవడమే కాకుండా ఏకంగా చెక్కుల మీద సంతకాలు చేసుకొని ఖాతాలు ఖాళీ చేసేదాకా వదలరు. ఇప్పుడు మొదలవుతుంది అసలు ట్విస్ట్. ఈ అమ్మాయిల అరాచకాలు భరించలేక చాలామంది పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. దీంతో పోలీసుల దృష్టి వీళ్లపై పడుతుంది. మరి పోలీసుల నుంచి ఈ నలుగురు అమ్మాయిలు తప్పించుకున్నారా? ఇలా బిగ్ షాట్స్ నుంచి కాజేసిన డబ్బులు ఏం చేశారు? అసలు వాళ్ళు పోలీసులకు ఎలా దొరికారు? అనే విషయాలు తెలియాలంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీపై ఓ లుక్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు