OTT Movie : పుట్టడమే క్లాక్ తో పుడతారు… 25 ఏళ్లకు మించి బ్రతకాలంటే టైంను కొనాల్సిందే

OTT Movie : టైం ఎంత విలువైందో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే గడిచిన సమయం తిరిగి రాదు అంటూ ఉంటారు పెద్దలు. అయినప్పటికీ చాలామందికి అర్థం కాక చాలా సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు సజెషన్ లో ఆ టైం విలువను అర్థమయ్యేలా చెప్పే మూవీ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ మూవీ చూడాలి అనుకునే వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ బెస్ట్ ఆప్షన్. మరి ఈ మూవీ టైటిల్ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ ఓ బెస్ట్ సై ఫై ఫిలిం. కాన్సెప్ట్ ఎంత కొత్తగా ఉంటుంది అంటే ఇప్పటిదాకా ఎక్కడ చూసి ఉండరు. కంప్లీట్ గా టైం గురించి తెరకెక్కిన ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం పేరు ఇన్ టైం. ఈ మూవీ 2011లో రిలీజ్ కాగా, ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్క్రీనింగ్ అవుతుంది. ఇక ఇదేదో సాధారణ సైన్స్ ఫిక్షన్ మూవీ కాదు ఎక్కడలేని చిత్ర విచిత్రాలన్నీ ఇందులోనే చూసే ఛాన్స్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

In Time - Full Cast & Crew - TV Guide

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే…

ఈ మూవీలో జనాలు పుట్టడమే చేతి మీద డిజిటల్ క్లాక్ తో పుడతారు. బతకాలి అన్నా టైం తోనే, ఏదైనా కొనాలి అన్నా టైం తోనే. ఒకవేళ టైం గనక జీరో అయింది అంటే సెకండ్ కూడా ఆలస్యం కాకుండా నొప్పి లేకుండానే మనిషి చనిపోతాడు. అంతేకాదు 25 ఏళ్లు దాటాక వీళ్ళకి వృద్ధాప్యం అనేదే రాదు. ఎన్నేళ్లయినా టైం ఉంటే 25 లోనే ఉండిపోతారు. ఈ సినిమా 2169వ సంవత్సరంలో జరుగుతున్నట్టుగా చూపిస్తారు. జెనటిక్ ఇంజనీరింగ్ ద్వారా 25 సంవత్సరాలు వచ్చాక అందరి వయసు ఆగిపోవడం, వృద్ధాప్యం అనేది రాకుండా డిజైన్ చేస్తారు. ప్రతి ఒకళ్ళకి చేతి మీద డిజిటల్ క్లాక్ ఉంటుంది. అందులో తాము బ్రతకడానికి ఇంకెంత సమయం ఉందో చూసుకోవచ్చు. బ్రతికే సమయాన్ని పెంచుకోవాలంటే పని చేసే సమయాన్ని సంపాదించుకోవాలి.

అయితే ధనవంతులు మాత్రం తరిగిపోని టైంతో చావనేదే లేకుండా బ్రతికేస్తుంటే, మరోవైపు పేదవాళ్లు కష్టపడి పని చేస్తూ బ్రతకడానికి ఒక్కో నిమిషాన్ని పోగేసుకుంటూ విపరీతమైన కష్టాలు పడతారు. అందులో హీరో విల్ పేదవాడు కానీ తెలివైనవాడు. అయితే టైం ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక్క క్షణం ఆలస్యం అవ్వడంతో తన చేతిలోనే తల్లిని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత ధన్యవంతుల చోటుకి ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్లి అక్కడే ఫిలిప్ ను అతని కూతురు సిల్వియాను కలుస్తాడు. తరువాత ఆమెను కిడ్నాప్ చేసి పేదలందరూ బ్రతకడానికి 1000 సంవత్సరాల టైం ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తాడు. మరి విల్ అనుకున్నది సాధించగలిగాడా? సిల్వియాను విల్ చివరికి ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు