OTT Movie : కలలను దొంగిలించే హీరో… మతిపోగొట్టే ఈ సై-ఫై మూవీ ఏ ఓటిటీలో ఉందంటే?

OTT Movie : సైన్స్ ఫిక్షన్ మూవీలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూసినంతసేపు ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. అందులో ఉండే గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మరికొన్ని సినిమాలు కన్ఫ్యూజన్ కు గురి చేసినప్పటికీ మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ను తెప్పిస్తాయి. మళ్లీ మళ్లీ ఆ సినిమాను చూడడమే కాకుండా ఇంకొకరికి రికమెండ్ చేసేలా ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన సినిమాలు వచ్చేది మరెక్కడి నుంచో కాదు హాలీవుడ్ నుంచే. ఈరోజు కూడా మనం చెప్పుకునే మూవీ ఓ దిమ్మతిరిగే సైన్స్ ఫిక్షన్ మూవీ.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మూవీ కలలను దొంగిలించడం లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ తో నడుస్తుంది. మనందరికీ కలలు వస్తాయి. కానీ వాటిని దొంగిలించడం అనేది నిజంగానే సరికొత్త కాన్సెప్ట్. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా పేరు ఇన్సెప్షన్. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Inception - Movie - Where To Watch

- Advertisement -

కథ ఏంటంటే…

ఇందులో హీరో పేరు జాబ్. ఓ బిజినెస్ మాన్ అతనికి ఓ పెద్ద టాస్క్ ఇస్తాడు. నిజానికి అంతకంటే ముందే హీరో సముద్రం ఒడ్డున పడిపోతాడు. దీంతో హీరోని అక్కడి నుంచి తీసుకెళ్లి బిజినెస్ మాన్ కి అప్పగిస్తారు అతని మనుషులు. బిజినెస్ మాన్ హీరోతో ఓ రిచ్ కిడ్ మైండ్ లో తను చెప్పిన ఆలోచనను ఫిల్ చేసి అతని సామ్రాజ్యానికి కుప్పకూలేలా చేయాలని ఆర్డర్ వేస్తాడు. ఎందుకంటే హీరో ఒక మనిషిలోని ఆలోచనని దొంగలించగలడు, అలాగే కొత్త ఆలోచనలతో ఫిల్ చేయగలడు కూడా. ముఖ్యంగా కలల్ని దొంగిలించడం అనే స్కిల్ లో ఇతను ఎక్స్పర్ట్. అంతేకాదు అవతలి వ్యక్తి మనసులో ఏముందో ఇట్టే చెప్పగలరు. కానీ హీరో మాత్రం ఈ బిజినెస్ మాన్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ దొంగిలించాలని ఫిక్స్ అవుతాడు. కానీ ఆ పని చేయడానికి హీరోకి స్పెషల్ గా ఓ మిషన్ కావలసి ఉంటుంది. కానీ హీరో కంటే ముందే ఆ బిజినెస్ మాన్ దాన్ని కనిపెడతాడు. ఆ బిజినెస్ మాన్ తనకు బిజినెస్ లో ఎవ్వరూ అడ్డు లేకుండా, తను నెంబర్ వన్ బిజినెస్ టైకూన్ గా ఉండాలంటే అప్పటికే పోటీగా ఉన్న మరో బిజినెస్ మ్యాన్ ను నాశనం చేయాలని డిసైడ్ అవుతాడు. అందులో భాగంగానే హీరోకి ఈ పని చెప్తాడు. పైగా దానికోసం ప్రత్యేకంగా ఓ టీం ను కేటాయిస్తారు. అయితే కలలు ఎన్నో రకాలుగా ఉండడంతో ఇక్కడ సినిమాలో ఎవరెవరో వస్తూ పోతూ ఉంటారు. మరి హీరో అందరినీ ఎలా హ్యాండిల్ చేస్తాడు? అయినా అనుకున్న పనిని చేయగలిగాడా? కలలను దొంగలించడం అనే కాన్సెప్ట్ ఎంత వరకు వర్కౌట్ అయింది? అనేది తెలియాలంటే వెంటనే ఇన్సెప్షన్ మూవీని చూడండి. సైన్స్ ఫిక్షన్ సినిమాలను బాగా ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు