OTT Movie : చేయని హత్యా నేరానికి బలయ్యి దిక్కుతోచని స్థితిలో హీరో… అసలు సిసలైన కోర్టు రూం డ్రామా

OTT Movie : ఇటీవల కాలంలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓటిటి కేటగిరీలో కోర్టు రూమ్ డ్రామా కూడా ఒకటి. తెలుగులో ఇంతకుముందే ఇలాంటి ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ వకీల్ సాబ్ తర్వాత మరింతగా ఈ జానర్ సినిమాలపై ఆసక్తి పెరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా వచ్చిన మోహన్ లాల్ నేరు మూవీకి కూడా భాషతో సంబంధం లేకుండా అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఇక ఓటీటీలో ఉన్న ఎన్నో కోర్టు రూమ్ డ్రామాలు కూడా ఉత్కంఠ భరితంగా సాగే కథనంతో ప్రేక్షకులను మెప్పించాయి. అలా కోర్ట్ రూమ్ డ్రామాలను ఎక్కువగా ఇష్టపడే వారి కోసమే ఈ రోజు ఈ మూవీ సజెషన్. చేయని హత్యా నేరంలో దిక్కుతోచని పరిస్థితిలో ఉండే హీరో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ పేరేంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

ఆహాలో స్ట్రీమింగ్..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు వ్యూహం. ఈ టైటిల్ వినగానే రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం మూవీ గుర్తొస్తుంది ఎవరికైనా. కానీ ఆ మూవీ ఈ మూవీ మాత్రం ఒకటి కాదు. ఇదొక డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ మూవీ. 2020లో థియేటర్లలోకి వచ్చింది. ఇవన్నీ చెప్పడం కంటే ఇదొక మలయాళ కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పడం బెటర్. సాధారణంగానే మలయాళ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక కోర్ట్ రూమ్ డ్రామా అంటే కచ్చితంగా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ వ్యూహం మూవీ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

Watch Vyuham Full Movie Online in HD Quality only on aha

- Advertisement -

స్టోరీ లోకి వెళ్తే…

ఈ మూవీ స్టోరీ ఏంటంటే హీరో హోటల్ లో పని చేస్తాడు. అయితే సడన్ గా ఒక రోజు హీరో పని చేస్తున్న హోటల్ లో భయంకరమైన హత్య జరుగుతుంది. పోలీసులు కేసును సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ ఏకంగా రంగంలోకి దిగి హత్య ఎవరో చేశారు అని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కానీ వివరాలు పెద్దగా తెలియకపోవడంతో ఎవరో ఒకరిని ఇరికించాలని అనుకుంటారు. ఇంకేముంది హోటల్లో పని చేస్తున్న హీరోను టార్గెట్ చేసి, నేరం మోపడానికి ప్రయత్నిస్తారు. అసలు అతను హత్య చేయకపోయినా హీరోకు వ్యతిరేకంగా సాక్షాలు క్రియేట్ చేసి మరీ అతనిపై నింద వేస్తారు.

హీరో గురించి తెలిసిన వాళ్ళు కొంత మంది ప్రయత్నించినా అతనికి సపోర్ట్ గా నిలిచే అవకాశాన్ని కూడా ఇవ్వరు. ఇలాంటి దిక్కు తోచని క్లిష్ట పరిస్థితుల నుంచి హీరో బయట పడ్డాడా? ఆయనకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు వచ్చారు? న్యాయం చేయాల్సిన పోలీసులే ఎందుకు నిరపరాధిని ఈ కేసులో ఇరికించారు? అసలు ఈ కేసులో కోర్టులో ఏం జరుగుతుంది? చివరకు ఎలాంటి తీర్పు ఇస్తారు? అనే విషయాలు తెలియాలంటే వ్యూహం సినిమాను చూసి తీరాల్సిందే. ఒకవేళ ఇప్పటిదాకా ఈ మూవీని కనుక చూసి ఉండకపోతే తప్పకుండా ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు