OTT Movie : అబ్బాయిల హాస్టల్ లో కన్నెపిల్ల ఇరుక్కుంటే… హీరోయిన్ తెలుగమ్మాయే

OTT Movie : ఇప్పుడున్న డిజిటల్ యుగంలో చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి రెండు వారాలు కూడా కాకముందే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటిటిలకు రోజురోజుకు డిమాండ్ మరింత పెరుగుతోంది. ఇక తాజాగా మన మూవీ సజెషన్ లో తాజాగా రిలీజ్ అయిన కొత్త మూవీనీ తీసుకొచ్చాము. మొత్తం బాయ్స్ ఉండే ఓ హాస్టల్ లో అమ్మాయి చిక్కుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది అని కథాంశంతో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ మూవీ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అయితే టైటిల్ ను చూసి బో*ల్డ్ మూవీ అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

జిలేబిలా తియ్యగా…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు జిలేబి. టైటిల్ లాగే మూవీ ఆహ్లాదకరంగా, రిప్రెషింగ్ కథతో ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి, రాజశేఖర్ కూతురు శివాని  నటించింది. స్టార్ హీరో వారసరాలు అయినప్పటికీ గ్లామర్ పరంగా రంగంలోకి దిగకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. కాబట్టి నిక్షేపంగా ఆమె నటించే సినిమాలను కుటుంబంతో కలసి చూడవచ్చు.

Jilebi Movie Show Times | SHMOTI

- Advertisement -

ఇక ఈ సినిమాలో శివానితో పాటు రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీని త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. కానీ ఇంకా రిలీజ్ డేట్ పై క్లారిటీ రాలేదు. మరి జిలేబి మూవీని ఆహా వారు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

కథలోకి వెళ్తే…

సినిమాలో హీరో పేరు కమల్. హీరోయిన్ పేరు భారతి. వీళ్ళిద్దరికీ ఒకానొక సమయంలో పెరిగిన పరిచయం నెమ్మదిగా ఫ్రెండ్షిప్ గా మారుతుంది. కానీ అదే వీళ్ళిద్దరికీ అతి పెద్ద సమస్యగా మారుతుంది. ఓ రోజు కమల్ భారతిని తాను ఉంటున్న బాయ్స్ హాస్టల్లోకి తీసుకెళ్తాడు. హాస్టల్ మొత్తం తిప్పి చూపిస్తాడు. అయితే ఆ సమయంలో హాస్టల్ లో ఎవ్వరూ ఉండరు. కానీ తీరా ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకోగానే సమస్య మొదలవుతుంది. దీంతో భారతి కమల్ హెల్ప్ తీసుకుని బయట పడాలి అనుకుంటుంది. మరోవైపు హాస్టల్ వార్డెన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అంతేకాకుండా హాస్టల్ లోకి ఓ అమ్మాయి వచ్చింది అనే పుకారు షికారు చేస్తుంది. ఈ క్రమంలోనే భారతికి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి కమల్ కి. ముఖ్యంగా ఆమె తండ్రి గురించి. మరి అక్కడ నుంచి భారతి బయట పడిందా? ఎవరికీ కనిపించకుండా భారతిని కమల్ ఎక్కడ దాచి పెట్టాడు? మరి భారతి సీక్రెట్ ఏంటి ? ఆమె తండ్రి గురించి ఎందుకు భయపడుతుంది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూసి తీరాల్సిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చూడాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ మూవీపై ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు