OTT Movie : ప్రతి మంగళవారం ఆ ఊర్లోకి దయ్యం ఎంట్రీ… డోర్ తెరవకపోతే ఆ ఇంట్లో తేలేది శవమే

OTT Movie : చూస్తుండగానే వీకెండ్ వచ్చేసింది. ఇప్పటికే ఈవారం ఓటీటీలోకి పదుల సంఖ్యలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అడుగుపెట్టాయి. అవన్నీ కాకుండా ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ హారర్ అండ్ కామెడీ జానర్ లో ఉండే సినిమాను చూడాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. హారర్ కామెడీ సినిమాలు ఇప్పటిదాకా వచ్చి సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒకవైపు వెన్నులో వణుకు పుట్టిస్తూనే, మరోవైపు కడుపుబ్బా నవ్విస్తుంది. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. మరి ఈ హారర్ కామెడీ మూవీ పేరేంటి? స్టోరీ ఏంటి? అనే విషయంపై లుక్కేద్దాం పదండి.

జీ5లో స్ట్రీమింగ్…

రీసెంట్ గా అత్యంత తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీ ముంజ్యా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మూవీ డైరెక్టర్ ఆదిత్య సర్పోదర్ రూపొందించిన మరో హారర్ మూవీనే కాకుడా. ముంజ్యా మూవీ బాలీవుడ్ లో 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన చిన్న సినిమాగా చరిత్రను సృష్టించింది. ఇక కాకుడా కూడా ఓటిటిలో అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్స్ సోనాక్షి సిన్హా, జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రలు పోషించారు. జూలై 12 నుంచి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇప్పటిదాకా ఇంకా సూపర్ హిట్ మూవీని చూడకపోతే ఈ వీకెండ్ మర్చిపోకుండా చూడండి.

Kakuda Movie (2024) | Release Date, Cast, Trailer, Songs, Streaming Online at ZEE5

- Advertisement -

కథ ఏంటంటే…

ఈ స్టోరీ అంతా ఓ శాపగ్రస్తమైన ఊరు చుట్టూ తిరుగుతుంది. ఈ లైన్ వినగానే మనకు గుర్తొచ్చేది మంగళవారం మూవీ. దాంతో పాటే విరూపాక్ష కూడా. అయితే వీటన్నిటికంటే డిఫరెంట్ గా ఉంటుంది కాకుడా మూవీ. ఇక స్టోరీలోకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రంలోని రాథోడ్ అనే గ్రామం ఉంటుంది. ఈ శాపగ్రస్తమైన ఊర్లోకి ప్రతి మంగళవారం ఒక దయ్యం ఎంట్రీ ఇస్తుంది. సరిగ్గా రాత్రి 7:15 గంటలకు ఆ దయ్యం ఊర్లోకి వస్తుంది. అయితే ఆ సమయంలో ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి ఉండే చిన్న, పెద్ద అనే రెండు డోర్లు తెరిచి పెడతారు జనాలు. ఎవరైనా మర్చిపోతే లేదా భయంతో క్లోజ్ చేసినా ఆ ఇంట్లో నెక్స్ట్ డే చావు కబురు అందుతుంది. అయితే ఇలాంటి మిస్టేక్ చేసి హీరోయిన్ సోనాక్షి భర్త ఆ దయ్యానికి బలైపోతాడు. దీంతో అదే టైంలో దయ్యాలని పట్టుకోవడానికి ఆ ఊరికి వచ్చిన రితేష్ తో కలిసి దాని గురించి తెలుసుకోవడానికి సోనాక్షి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. మరి సోనాక్షి భర్తను ఆ దయ్యం ఏం చేసింది? అసలు కాకుడా దయ్యం స్టోరీ ఏంటి? ఆ దయ్యాన్ని పట్టుకునే క్రమంలో వీరిద్దరికీ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే విషయాలు తెలియాలంటే కాకుడా మూవీని తెరపై చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు