OTT Movie : ముసలాడిని చంపి డబ్బు దొబ్బేయాలనే ప్లాన్ తో దత్తత… దొంగ మాస్టర్ ప్లాన్ తెలిసి అతనేం చేస్తాడంటే?

OTT Movie : డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో ఓ దొంగ అనాధ ముసలాడిని దత్తత తీసుకుని, ఏనుగులతో తొక్కి చంపించాలని మాస్టర్ ప్లాన్ వేస్తాడు. కానీ ఆ ముసలాడు దొంగతో పాటు అతని స్నేహితుడిని కూడా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. ఇక సహనం కోల్పోయిన దొంగ ఫ్రెండ్ అతన్ని చంపాలని మరో క్రూరమైన ప్లాన్ వేస్తాడు. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటిలో ఉంది? ఆ మూవీ పేరేంటి అనే వివరాల్లోకి వెళితే?

డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో..

మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవి ప్రకాష్ కుమార్ ఇటీవల తన భార్యతో  డివోర్స్ ప్రకటించి వార్తల్లో నిలిచాడు. జీవి ప్రకాష్ కుమార్ ప్రస్తుతం తమిళంలో మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూనే మరోవైపు స్టార్ హీరోగా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టులతో వరుసగా సినిమాలు తీస్తూ మూవీ లవర్స్ ను బాగా అలరిస్తున్నాడు. తాజాగా జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన కాల్వన్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. మే 14 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగులో కూడా…

తెలుగులో ఈ మూవీని చోరుడు అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఇందులో లవ్ టుడే హీరోయిన్ ఇవానా నటించింది. భారతి రాజా, చరణ్ రాజ్, వినోద్ మున్నా వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు సంగీతం కూడా అందించాడు జీవి ప్రకాష్. పివి శంకర్ దర్శకత్వం వహించగా, ఎక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ఢిల్లీ బాబు నిర్మించారు. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీకి ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ తమిళ, తెలుగు భాషలతో పాటు మలయాళ, కన్నడ భాషల్లో కూడా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

ఈ సినిమాలో హీరోనే దొంగ. సత్యమంగళం అనే అడవి అంచులో ఉన్న ఓ గ్రామంలో ఈ దొంగ తన స్నేహితుడితో కలిసి నివసిస్తాడు. అయితే అక్కడ ఏనుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. అడవిలోకి వెళ్లే వారిని ఏనుగులు తొక్కి చంపేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి అక్కడ హీరోయిన్ ని చూసి ప్రేమలో పడతాడు ఈ దొంగ. ఆమె నర్సింగ్ స్టూడెంట్ కావడంతో ఇంప్రెస్ చేయడానికి ఎంతగానో ట్రై చేస్తాడు. ఆమె కోసమే దొంగతనాలు మానేసి ఫారెస్ట్ ఆఫీసర్ కావాలనుకుంటాడు. కానీ హీరోయిన్ అతని వైపు కన్నెత్తి కూడా చూడదు. అయితే తన ట్రైనింగ్ లో భాగంగా అనాధ శరణాలయానికి వెళ్లిన హీరోయిన్ అక్కడున్న ఓ ముసలాయనను చూసి జాలి పడుతుంది.

దీంతో హీరో ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఆ ముసలాయనను దత్తత తీసుకొని తనతో పాటు ఊరికి తీసుకెళ్తాడు. వెంటనే హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది. అయితే దీంతో పాటే ఈ దొంగ మరో మాస్టర్ ప్లాన్ కూడా వేస్తాడు. ఏనుగులతో ఈ ముసలాడిని తొక్కి చంపించేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తాడు. కానీ ఆ తర్వాత ఈ ప్లాన్ గురించి ముసలాయనతో పాటు హీరోయిన్ కు కూడా తెలిసిపోతుంది. మరి అనుకున్నట్టుగానే ఆ ముసలాడిని చంపేశారా? దొంగ ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యాడా? తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు