OTT Movie : ప్రతి రోజూ ఉదయం 5 గంటలకే ఆ కాల్… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఈరోజు మనం మూవీ సజెషన్ సస్పెన్స్ మూవీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి కోసమే. ఇక అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్, సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ వంటి రెండు డిఫరెంట్ సినిమాలు ఉంటాయి. అయితే నార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల కంటే సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు మంచి కిక్ ఇస్తాయని చెప్పొచ్చు. సాధారణంగా మనలో చాలామంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతాము. కానీ మన ఆత్మ మనకి కాల్ చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ డైరెక్టర్ మాత్రం ఇదే ఆలోచనతో ఓ సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఈ మూవీలో హీరోయిన్ గా దీపిక పదుకొనే నటించడం విశేషం. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ పేరు కార్తీక్ కాలింగ్ కార్తీక్. ఈ మూవీ టైటిల్ కు తగ్గట్టుగానే విచిత్రంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే ఈ వీకెండ్ ఓ లుక్ వేయండి.

Review: 'Karthik Calling Karthik' dials a wrong number

- Advertisement -

కథ ఏంటంటే…

కార్తీక్ ఎవరితోనూ గట్టిగా మాట్లాడలేక పోతాడు. దాన్నే అలుసుగా తీసుకొని అతని ఫ్రెండ్స్ తరచుగా కార్తీక్ ను ఏడిపిస్తూ ఉంటారు. కార్తీక్ ఇలా ఎవరితో మాట్లాడకుండా మూడీగా, ఒంటరిగా ఉండడానికి గల కారణం అతని గతం. చిన్నప్పుడు అతని జీవితంలో జరిగిన అనుకోని ఓ సంఘటన కారణంగా అతను తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. సైకియాట్రిస్ దగ్గర చికిత్స తీసుకుంటూ ఉంటాడు. అయితే కార్తీక్ కి తన జీవితంలో నచ్చే ఒకే ఒక విషయం సోనాలి. ఆఫీసులో తన కొలీగ్ అయిన ఆ అమ్మాయిని కార్తీక్ వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. ఆమెకు తన ప్రేమను చెప్పకుండా మనసులోనే దాచుకుంటాడు. అయితే ఈ క్రమంలోనే ఓ రోజు అతని జాబ్ పోతుంది. ఇంకేముంది జీవితంలో ఉన్న ఒక ఆధారం కూడా పోవడంతో డిప్రెషన్ పెరిగి చనిపోవాలని అనుకుంటాడు. అందుకోసం స్లీపింగ్ పిల్స్ వేసుకోవడానికి ట్రై చేస్తాడు. అంతలోనే కార్తీక్ కి కాల్ వస్తుంది. అయితే విచిత్రంగా ఆ కాల్ చేసింది ఎవరో కాదు మరో కార్తీక్. అంటే తనకు తానే ఫోన్ చేసుకుంటున్నాడు అన్నమాట. కానీ ఒక వ్యక్తి తనకు తానే ఫోన్ చేసుకోవడం ఎలా సాధ్యం? అందుకే కార్తీకి ఆ కాల్ రాగానే భయమేస్తుంది. అయితే తనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ను కార్తీక్ పొల్లు పోకుండా చెప్పడంతో షాక్ అవుతాడు. అప్పటికే భయపడి ఫోన్ పెట్టేసినా కూడా అదే వ్యక్తి ఇలా ప్రతిరోజు ఉదయం 5 గంటలకే ఫోన్ వస్తుంది. మరి ఇంతకీ ఇలా ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎవరు? కార్తీక్ గతం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే నెట్ ఫ్లిక్స లో స్ట్రీమింగ్ అవుతున్న కార్తీక్ కాలింగ్ కార్తీక్ అనే సినిమాను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు