OTT Movie : హనీమూన్ ట్రిప్పుకెళ్తే భర్తను వదిలేసి రిసార్ట్ ఓనర్ తో… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చదవడానికి టైటిల్ బో*ల్డ్ గానే ఉన్నా ఈ మూవీ మాత్రం ఆ జానర్ కి సంబంధించింది కాదు. నిజానికి సస్పెన్స్ థ్రిల్లర్ లేదా హారర్ సినిమాలను చూసినప్పుడు ఉత్కంఠ భరితంగా ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆలోచించేటంత ఓపిక లేనప్పుడు ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. అలా ఫీల్ అవుతున్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఈ మూవీ పేరు కథేయొందు షురూవాగిదే. ఇదొక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ ఈ మూవీని ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ అస్సలు మిస్ అవ్వొద్దు. లవర్స్ మస్ట్ వాచ్.

Katheyondu Shuruvagide (2018) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

హీరో తరుణ్ అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే కొన్నాళ్లు అక్కడ పని చేశాక జాబ్ చేయడం బోర్ కొట్టి తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు. బాగా ఆలోచించి ఇక్కడ రిసార్ట్ బిజినెస్ ను మొదలు పెడతాడు. అయితే కొత్త బిజినెస్ కదా ముందు బాగానే నడుస్తుంది. అంతా ఒకే అనుకునేలోపే దివాలా తీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ జంట హనీమూన్ ట్రిప్ కోసం హీరో రిసార్ట్ ను బుక్ చేసుకుంటారు. ఆ జంట పేరు మిస్టర్ అండ్ మిసెస్ మెహ్రా. నాలుగు రోజుల పాటు హనీమూన్ ట్రిప్ ను ప్లాన్ చేసుకుంటారు ఈ జంట. దీంతో వాళ్లను పిక్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లిన హీరోకు షాక్ తగిలినంత పనవుతుంది. ఎందుకంటే హనీమూన్ అంటే అప్పుడే పెళ్లయిన కొత్త జంట ఇద్దరూ ఒకరినొకరు చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ, జీవితంలో మర్చిపోలేని మెమోరీస్ ను క్రియేట్ చేసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు.

కానీ ఇప్పుడు రిసరతును బుక్ చేసుకున్న జంట విషయానికి వస్తే అక్కడ కేవలం అమ్మాయి మాత్రమే ఉంటుంది. హీరో ఆమెను తన భర్త గురించి ఎంత అడిగినా హీరోయిన్ నోరు కూడా విప్పదు. అయితే ఒకానొక సందర్భంలో తన భర్త చనిపోయి మూడు నెలలు అయిపోయిందని హీరోకి చెప్పేస్తుంది. ఆ తర్వాత మొదలవుతుంది కథ. ఇద్దరి మధ్య మాటలు, మనసు రెండు కలుస్తాయి. ఇంకేముంది రిసార్ట్ కి వెళ్ళాక హీరో హీరోయిన్ మధ్య ప్రేమ మొదలవుతుంది, మారంత దగ్గరవుతారు కూడా. ఇక ట్రిప్ ముగించుకొని హీరోయిన్ వెళ్ళిపోయే టైం వచ్చేస్తుంది. అదే టైంలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అసలు హీరోయిన్ భర్త ఎలా చనిపోయాడు ? మరి చివరికి హీరో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ? చివరికి ఈ స్టోరీ ఎలా ముగిసింది అనే ఇంట్రెస్టింగ్ విషయం తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని ఈ వీకెండ్ చూస్తే తెలిసిపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు