OTT Movie : మాఫియాకే చెమటలు పట్టించే ఒంటరి అమ్మాయి… క్రేజీ కొరియన్ మూవీ

OTT Movie : ఓటిటిల పుణ్యమా అని కొరియన్ మూవీస్ కు ఇండియన్ మూవీ లవర్స్ లో ఓ రేంజ్ లో క్రేజ్ పెరిగింది. కొంతమంది అయితే ఏకంగా వెబ్ సిరీస్ లు, సినిమాలను చూసే కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. మరి కొంతమంది వాళ్ళు ట్రెండీగా ఫాలో అయ్యే కొరియన్ ఔట్ ఫిట్ తో ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇంకొందరైతే కొరియన్ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యేంత వరకు పక్కకు కూడా కదలట్లేదు. ఇలా కొరియన్ సినిమాలను పిచ్చిగా చూసే వారి కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. అయితే ఇదేదో సాఫ్ట్ లవ్ స్టోరీ లేదా హారర్ మూవీ మాత్రం కాదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ ఒక క్రేజీ కొరియన్ క్రైమ్ డ్రామా. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయంపై లుక్కేద్దాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఈ రోజు మనం చెప్పుకుంటున్న మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని ప్రచారం ఉంది. కొరియన్ భాషలో తెరకెక్కిన థ్రిల్లర్, యాక్షన్ సినిమాలలో ఇది కూడా ఓ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం తల్లి కూతుర్ల చుట్టూనే తిరుగుతుంది. ఓ అమ్మాయి మాఫియాకి చెమటలు పట్టిస్తుంది.

All About Citizen of a Kind Korean Movie Starring Ra Mi-ran, Gong Myung and Others

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

ఇందులో హీరోయిన్ కి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆమె సొంతంగా ఓ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచనతో లోన్ కోసం అప్లై చేసుకుంటుంది. అయితే లోన్ పేరుతో ఓ కాల్ వస్తుంది. వాళ్లు లోన్ ఇవ్వడాన్ని పక్కన పెట్టేసి ఏదో ఒక సాకుతో బ్యాంకులో అప్రూవ్ చేస్తాం అంటూ ఆమె దగ్గర డబ్బులు గుంజుతూ ఉంటారు. అయితే ఒకానొక సమయంలో హీరోయిన్ ఇన్నాళ్లు తాను డబ్బు కట్టింది లోన్ అప్రూవ్ చేసే వారికి కాదని, ఇదో పెద్ద ఫ్రాడ్ అని తెలుసుకుంటుంది. పైగా దీని వెనక ఓ మాఫియా ఉందని తెలిసి షాక్ అవుతుంది. కానీ అప్పటికే లోన్ వస్తుందనే ఆశతో తన దగ్గర ఉన్న డబ్బునంతా పోగొట్టుకుంటుంది. దీంతో పిల్లలను ఆశ్రమానికి పంపిస్తుంది. ఆ తర్వాత మాఫియా పని పట్టే బాధ్యతను తలకెత్తుకుంటుంది. అసలు ఈ ఫ్రాడ్ వెనక ఉన్నదెవరు? ఈ పని చేస్తున్న వాళ్ళను బయటకు రాగాలని ఫిక్స్ అయ్యి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. ఓ లీడ్ దొరకడంతో ఏకంగా చైనాకు వెళుతుంది. తను ఒక్కతే కాకుండా మరో ఇద్దరు మహిళల సహాయంతో మాఫియాకే ఎదురు వెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ లైఫ్ లో ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఆ మాఫియా గుట్టును బయట పెట్టగలిగిందా? తనకు జరిగిన అన్యాయానికి ఆమె పగ తీర్చుకుందా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలకు సమాధానం తెలియాలంటే సిటిజెన్ ఆఫ్ కైండ్ (Citizen of Kind) అనే ఈ సినిమాను చూడాల్సిందే. అయితే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో లేదు. కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వీక్షించవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు