OTT Movie : భర్త ఉండగా పని వాడిపై మనసు… దొరికిపోయిన ఆ భార్య చెప్పింది విని షాక్

OTT Movie : టైటిల్ ను చూసి మీరు అనుకున్నట్టుగా ఇది బో*ల్డ్ మూవీనే. కానీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. పైగా పలు అవార్డులు కూడా దక్కించుకుంది. లవ్ స్టోరీలు అంటే క్రేజీగా ఫీల్ అయ్యే వారికి ఇదొక మంచి మూవీ సజెషన్ అవుతుంది. ఈ మూవీలో కథ, కథనంతో పాటు టేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక బో*ల్డ్ అన్నాం కాబట్టి ఆ ఒక్క అంశం మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఇందులో యాక్షన్ సన్నివేషాలు కూడా కావలసినన్ని ఉంటాయి. మరి అన్ని అంశాలు కలగలిపిన ఈ బో*ల్డ్ ఎంటర్టైనర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనే విషయాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పక్కా బో*ల్డ్ కంటెంట్ తో ఉంటుంది. కాబట్టి సింగిల్ గా చూడాలని గుర్తు పెట్టుకోండి. ఇక మూవీ టైటిల్ విషయానికి వస్తే లేడి చాటర్లీస్ లవర్. భాష అడ్డు కాదు అనుకునేవారు ఈ మూవీని దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. స్టోరీ రొటీన్ గానే ఉంటుంది. కానీ టేకింగ్ మాత్రం బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Watch Lady Chatterley's Lover | Netflix Official Site

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఇందులో హీరోయిన్ ఆర్మీ అధికారిని పెళ్లాడుతుంది. కానీ అతను అందరిలా మామూలు మనిషిలా కాకుండా కుర్చీకే పరిమితమై ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలి అన్నా వీల్ చెయిర్ ఉండాల్సిందే. అలాంటి వ్యక్తి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయ్యాక ఆమె పేరుకే భార్య అన్నట్టుగా ఉంటుంది. ఒక నర్స్ చేయాల్సిన పనులన్నీ ఆ అమ్మాయితో చేయిస్తాడు. అయితే చూడడానికి చాలా అందంగా ఉండే ఆమెకు అసలు ఆ సు*ఖం అన్నదే లేకుండా పోతుంది. భర్తకు సేవలు చేస్తూ కాలం గడుపుతుంది. అంత పెద్ద కోట లాంటి ఇంట్లో ఆమెకు తోడుగా ఒక్కరు కూడా ఉండరు. అయితే అతనికి లెక్క లేనంత ఆస్తి ఉంటుంది. కానీ మంచానికి మాత్రమే అతను పరిమితం కావడమే వాళ్ళ కాపురంలో మైనస్ అవుతుంది.

మరోవైపు ఈ బంగ్లాలో పని చేసే పని వాడు హీరోయిన్ ఉంటున్న బంగ్లాకు దగ్గరలోనే ఓ పాకలో ఉంటాడు. నెమ్మదిగా హీరోయిన్ మనసు అటు మల్లుతుంది. ఇంకేముంది అతన్ని గమనించడం స్టార్ట్ చేస్తుంది. త్వరగానే ఆ పని వాడిపై మనసు పారేసుకుంటుంది. కానీ ఆ పని వాడు మాత్రం భయపడతాడు. తరువాత ఇద్దరూ దగ్గరవుతారు. మానసికంగా, శారీరకంగా. ఇక ఆ అమ్మాయి అతనితో ప్రేమలో పడ్డప్పటి నుంచి రోజూ ఉత్సాహంగా, సంతోషంగా కన్పిస్తుంది. అప్పటికే అనుమానంతో ఉన్న ఆమె భర్తకు ఒకరోజు దొరికిపోతారు. మరి భర్తకు ఆమె చెప్పిన సమాధానం ఏంటి? ఆమెను వదులుకునే పరిస్థితిలో లేని భర్త ఏం చేశాడు? చివరికి ఈ ఇద్దరు ప్రేమికుల పరిస్థితి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే లేడీ చాటర్లీస్ లవర్ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు