OTT Movie : ఆఫీస్ లో లవర్స్ కు చుక్కలు చూపించే దెయ్యం… లిఫ్ట్ అంటేనే జడుసుకునే హారర్ మూవీ

OTT Movie : సాధారణంగా హారర్ మూవీస్ అనగానే రివెంజ్ డ్రామాలు, లేదా దయ్యాలు అనుకోకుండా మనుషులని పట్టి పీడించడం వంటి స్టోరీలనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీలో మాత్రం ఇంకా కాస్త డిఫరెంట్ గా హారర్ మూవీలో లవ్ స్టోరీ టచ్ ఉంటుంది. పైగా సాఫ్ట్ వేర్ ఆఫీసులో దెయ్యాలు. వినడానికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి అనే విషయంలోకి వెళ్దాం పదండి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

దెయ్యాల సినిమాలు అనగానే ఊరికి దూరంగా ఎక్కడో పాడుబడిపోయిన బిల్డింగ్ లో, లేదంటే పెద్ద పెద్ద బూత్ బంగ్లాలలో స్టోరీ అనే కాన్సెప్ట్ కు విభిన్నంగా, రెగ్యులర్ గా కాకుండా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో సరికొత్తగా తెరకెక్కిన మూవీ లిఫ్ట్. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లఓ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కెయ్యండి.

Lift Full Movie Online in HD in Tamil on Hotstar CA

- Advertisement -

కథ ఏంటంటే…

సినిమాలో హీరో పేరు గురు ప్రసాద్. ఐటీ కంపెనీలో టీం లీడ్ గా పని చేసే గురు ప్రసాద్ ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇక అదే కంపెనీలో అతనికి ముందే పరిచయం ఉన్న హరిని అనే అమ్మాయి హెచ్ఆర్ గా పని చేస్తుంది. వీరిద్దరి మధ్య అప్పటికే ఓ పెద్ద గొడవ జరగడంతో ఇద్దరు ఒకరిపై ఒకరు కోపంతో ఊగిపోతారు. ఆ పగ, ప్రతీకారం తీర్చుకోవాలని సమయం కోసం వెయిట్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు హీరో పని ఎక్కువగా ఉండడంతో లేట్ నైట్ వరకు ఆఫీసులో ఉండిపోవాల్సి వస్తుంది. మరోవైపు హరిని కూడా అనుకోకుండా ఆఫీసులో ఇంకా పని చేస్తుంది. ఇక ఇద్దరు పని అయిపోగొట్టుకొని ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్ ఎక్కుతారు. కానీ ఊహించని విధంగా ఆ లిఫ్ట్ ఆగిపోతుంది. అక్కడే స్టక్ అయిపోయిన ఆ ఇద్దరికీ అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. లిఫ్ట్ లో ఇద్దరికి వింత వింత సంఘటనలు ఎదురు కావడంతో కొన్ని అదృశ్య శక్తులు వారిని అక్కడ బంధించినట్టుగా ఫీల్ అవుతారు. ఇక ఇదే బెస్ట్ టైం అనుకుని హీరో హీరోయిన్ ను చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే విషయం ఏమిటంటే అంతకుముందే ఆఫీసులో పని చేసే మరో ఇద్దరు కూడా అదే లిఫ్ట్ లో చనిపోయి ఉంటారు. కానీ మేనేజ్మెంట్ వాళ్లకు ఏమైంది అనే విషయాన్ని బయట పెట్టరు. మరి ఇంతకీ ఆఫీస్ మేనేజ్మెంట్ ఆ ఇద్దరు చావుల వెనకున్న కారణాన్ని ఎందుకు దాచి పెట్టారు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? వారిద్దరిని లిఫ్ట్ లో స్టక్ అయ్యేలా చేసిన ఆ అదృశ్య శక్తులు ఎవరు? చివరికి ఇద్దరు తప్పించుకో గలిగారా లేదా? అనే పాయింట్ తెలియాలంటే ఈ లిస్ట్ సినిమాను వెంటనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూసేయండి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు