OTT Movie : మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ కామెడీ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie : ప్రతి వారం ఓటీటిలో స్ట్రిమింగ్ అయ్యే కంటెంట్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వారం 10 రోజుల ముందు నుంచే ఏ ఓటీటీలో ఏ సినిమా రాబోతోంది అన్న ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. దీంతో ప్రేక్షకులు కూడా ఈ వారం ఏ సినిమాలు చూడాలి అన్న విషయాన్ని ముందుగానే డిసైడ్ చేసుకుంటారు. అయితే ఈ పది రోజుల గ్యాప్ లో వీకెండ్ వచ్చేసరికి కొన్ని సినిమాలు సైలెంట్ గా స్ట్రీమింగ్ కు రెడీ అవుతాయి. అసలు ఓటిటి ప్లాట్ఫార్మ్స్ కూడా కొన్ని సినిమాల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే డైరెక్ట్ గా రిలీజ్ చేసి తమ సబ్స్క్రైబర్లకు సర్ప్రైజ్ ఇస్తాయి. ఇలా ఏదో ఒక వారం మాత్రమే కాదు ప్రతి వారం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాన్ని చూసేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ అంటేనే ఒక మంచి ఇంట్రెస్టింగ్ జానర్. అయితే అది మలయాళ సినిమా అయితే మూవీ లవర్స్ కి పండగే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ కూడా ఇలాంటిదే. ముఖ్యంగా ఇటీవల కాలంలో మలయాళ సినిమాలకు భారీగా ఆదరణ పెరగగా, అది కామెడీనా, క్రైమా అనే సంబంధం లేకుండా మలయాళ సినిమా అయితే చాలు అనుకునే క్రేజీ మలయాళ మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ. ఈ సినిమా పేరు లిటిల్ హార్ట్స్. పేరుకు తగ్గట్టుగానే సినిమాలో రొమాన్స్ కూడా ఉంటుంది. అయితే మరో ప్లస్ పాయింట్ ఏంటంటే రొమాంటిక్ జానర్ కు కామెడీ టచ్ ఇచ్చారు మేకర్స్. జూన్ 7న థియేటర్లలోకి వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీ పాజిటివ్ టాక్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో షేర్ నిగమ్, మహిమ నంబియార్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీస్ సైలెంట్ గా పాపులర్ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. ఆగస్టు 13 నుంచి ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Little Hearts REVIEW: Is Shane Nigam, Mahima Nambiar's movie worth  watching? Here's what netizens are saying

- Advertisement -

స్టోరీ ఏంటంటే..

మూవీలో మొత్తం మూడు ప్రేమ కథలు ఉంటాయి. అందులో ఒకటి హీరో హీరోయిన్లు సిబి, సోషల మధ్య సాగే లవ్ స్టోరీ. రెండవది సిబి తండ్రి ప్రేమ కథ. మూడోది సోష తమ్ముడి లవ్ స్టోరీ. ఈ మూడు స్టోరీలలో నలుగురు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? అసలు వీళ్ళ లవ్ స్టోరీలు ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఎమోషన్ తో పాటు కామెడీని కలగలిపిన లిటిల్ హార్ట్స్ (Little Hearts) మూవీని చూసి తీరాల్సిందే. అయితే ఓటీటీ లవర్స్ కు నిరాశ కలిగించే విషయం ఏమిటంటే ఈ మూవీ ప్రస్తుతం మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో మాత్రం అందుబాటులో లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు