OTT Movie : 20 ఏళ్ల నుంచి పరిష్కారం కాని క్రైమ్ లన్నింటికీ ఆ బొమ్మే కారణం… గుండె ధైర్యం ఉన్నవాళ్లే ఈ మూవీని చూడండి

OTT Movie : హాలీవుడ్ లో హారర్ సినిమాలు ఎక్కువగానే వస్తాయి. కానీ మూఢనమ్మకాలు వంటి కాన్సెప్ట్ ని పెద్దగా టచ్ చేయరు. ఒకవేళ ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నప్పటికి ఎక్కువగా వైలెన్స్ ని వాడుకుంటారు. తాజాగా హారర్ తో పాటు వైలెన్స్ కాంబినేషన్లో వచ్చిన మూవీ థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. హారర్ మూవీ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా మారే ఈ మూవీ పేరేంటి? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఇంకా థియేటర్లలోనే….

ప్రస్తుతము అని చెప్పుకుంటున్న మూవీ ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. హారర్ ప్లస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఇక ఈ సినిమా పేరు లాంగ్ లెగ్స్. నిజానికి సినిమాలోని చాలా సన్నివేశాలు చూస్తున్నంత సేపు ఇండియన్ సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. కాకపోతే హీరోయిన్ చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ వచ్చినప్పుడు తర్వాత కథలో ఎలాంటి మలుపు చోటు చేసుకోబోతోందా అనే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. అస్గుడ్ పెర్కిన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మైకా మాన్రో హీరోయిన్ గా నటించింది.

Horror Film Longlegs, Released July 2024 What Date? - NOBARTV NEWS

- Advertisement -

కథలోకి వెళ్తే…

1970లో ఓరెగాన్ ప్రాంతంలో ఓ చిన్న పాపతో మధ్య వయసు ఉన్న వ్యక్తి మాట్లాడుతూ కనిపిస్తాడు. అతను లాంగ్ లెగ్స్ ధరించాను అంటూ పాపకు బర్త్ డే విషెస్ చెప్తాడు. ఆ తర్వాత కథ 1990 కి మారుతుంది. ఎస్బిఐ ఏజెంట్ అయిన హీరోయిన్ కి 20 ఏళ్ల క్రితం పరిష్కారం కానీ కొన్ని మర్డర్ కేసులను అప్పగిస్తారు. ఇలాంటి కేసులను సాల్వ్ చేయడంలో దిట్ట అయిన హీరోయిన్ ముందుగా ఒక సీరియల్ మర్డర్ కేసు గురించి ఇన్వెస్ట్గేట్ చేస్తుంది. 20 ఏళ్ల క్రితం ఓరెగాన్ లో చాలా కుటుంబాల్లో ఒక తండ్రి తన భార్యను కూతుర్ని హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన క్రైమ్ ను విచారిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి క్రైమ్ సీన్లో కూడా ఒక సైతాన్ భాషలో ఉండే లెటర్ దొరుకుతుంది. అందులో లాంగ్ లెగ్స్ అని ఉంటుంది.

కానీ ఆ చనిపోయిన ఫ్యామిలీలో ఒక్కరు కూడా ఆ లెటర్ రాసి ఉండదు. అలాగని ఎవ్వరూ వాళ్ళ ఇంట్లోకి బలవంతంగా చొరబడలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ప్రతి మర్డర్ లో చనిపోయిన పాప వయసు 9 ఏళ్ళు, బర్త్ డే డేట్ 14 అని తెలుసుకుంటుంది. ఇక ఆ తర్వాత మర్డర్ జరిగిన ఇంటికెళ్లి వెతకగా అక్కడ పాతిపెట్టిన బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మని చెక్ చేస్తే అందులో ఒక గాజు వస్తువు దొరుకుతుంది. అదేంటని చూస్తే అందులో భయంకరమైన దృశ్యాలన్నీ కనిపిస్తాయి. ఇక ఇదే బొమ్మ ప్రతి మర్డర్ జరిగిన ఇంట్లో కనిపిస్తుంది. మరి ఈ బొమ్మకి ఆ చావులకి సంబంధం ఏంటి? ఈ లాంగ్ లెగ్స్ అనే వ్యక్తి ఎవరు? చివరికి కేసు సాల్వ్ అయ్యిందా? హత్యలకు కారణమైన వాళ్ళని హీరోయిన్ కనిపెట్టిందా? అనే విషయాలు తెలియాలంటే లాంగ్ లెగ్స్ మూవీని తెరపై చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు