OTT Movie : బుర్ర కరాబ్ చేసే బో*ల్డ్ లవ్ స్టోరీ… ఏ ఓటీటిలో ఉందంటే?

OTT Movie : నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ లలో లవ్ స్టోరీ లకు కొదవ ఏమీ లేదు. కానీ లవ్ స్టోరీలలో కూడా రెండు రకాలుగా ఉండే సినిమాలు ఉంటాయి. అందులో ఓ రకం కంప్లీట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయితే మరికొన్ని బో*ల్డ్ అంశాలను కలగలిపి సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలు. అయితే ఈ మసాలా దట్టించిన సినిమాలను చూసే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఈరోజు మన మూవీ సజెషన్ ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఇష్టపడే వారి కోసమే. ఇక ఈ మూవీలో ఉండే క్రేజీ లవ్ స్టోరీని చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మరి ఈ ఇంట్రెస్టింగ్ బోల్డ్ ప్రేమ కథ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సోలో వాచింగ్ సో బెటర్

ఈ సినిమా ప్రస్తుతం ది ఫ్లిక్సర్ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అయితే చెప్పినట్టుగానే బోల్డ్ లవ్ స్టోరీ కాబట్టి ఈ సినిమాలో ఫ్యామిలీతో కలిసి చూడలేని సన్నివేశాలు కూడా ఉంటాయి. కాబట్టి బోల్డ్ మూవీ లవర్స్ ఈ మూవీని సింగిల్ గా చూస్తేనే బెటర్ అని గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ లవ్ స్టోరీనే కదా అనుకుని ఎవరితోనైనా కలిసి చూశారంటే మీ పని అంతే. ఒక ప్లే బాయ్ తో అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అని స్టోరీ తో తెరకెక్కిన ఈ సినిమాలో రకరకాల కోణాలతో స్టోరీ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది.

Love and Other Drugs|CATCHPLAY+ Watch Full Movie & Episodes Online

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

ఇందులో హీరో ఒక ఇంటర్న్ డాక్టర్. ఇది కేవలం ఒకవైపు మాత్రమే. రెండో వైపు ఈ హీరో ఒక ప్లే బాయ్. మాటలతో మాయ చేసి తన చుట్టూ ఉన్న అమ్మాయిలను ఈజీగా బుట్టలో వేసుకుంటాడు. ఇలా స్పెషల్ టాలెంట్ గా ఉన్న ఈ హీరో ఓ రోజు ఆస్పత్రికి వచ్చిన అమ్మాయితో సరదాగా పులిహోర కలుపుతాడు. అయితే అతను ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నాడో తెలిసినప్పటికీ హీరోయిన్ కూడా అతడితో మాట్లాడుతుంది. కొంతసేపటికి అసలు హీరో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అనే విషయాన్ని కనిపెడుతుంది. వెతకబోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టుగా హీరోయిన్ కూడా అలాంటి వాడి కోసమే వెతుకుతూ ఉంటుంది. మొత్తానికి అతను ఒక ప్లే బాయ్ అని తెలిసి కూడా కావాలని దగ్గరవుతుంది. హీరో ఓ వైపు ఇతర అమ్మాయిలతో తిరుగుతూనే హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తాడు. ఇద్దరూ అవసరాలు తీర్చుకోవాలని ఉద్దేశంతోనే ఇలా కలుస్తారు. కానీ కొంతకాలం తర్వాత ఇద్దరు ఒకరిని విడిచి ఒకరం ఉండలేము అన్నంతగా మారిపోతారు. స్టోరీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ప్రేమ ఎంత ఎక్కువైందో గొడవలు కూడా అంతే ఎక్కువగా వీరిద్దరి మధ్య జరుగుతూ ఉంటాయి. అసలు హీరో హీరోయిన్ ఎందుకు ఇలా గొడవలు పడ్డారు? చివరికి ఈ జంట ఒక్కటయిందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే లవ్ అండ్ అదర్ డ్రగ్స్ అనే ఈ సినిమాను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు