OTT Movie : పిచ్చెక్కించే బో*ల్డ్ లవ్ స్టోరీ… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : ఓటీటిలో ఉండే లవ్ స్టోరీలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో లవ్ స్టోరీలను చూసాం మనం. అయితే అందులో చాలా వరకు క్లైమాక్స్ లో సక్సెస్ ఫుల్ అయిన లవ్ స్టోరీ లనే జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఎండింగ్ హ్యాపీగా లేకపోతే ఆ సినిమా కష్టాల పాలైనట్టే. కానీ ఇతర భాషల్లో మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ఎండింగ్. ఈరోజు కూడా మనం చెప్పుకోబోయే మూవీ అలాంటిదే. ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా రిలేషన్షిప్స్ ఎందుకు పాడవుతున్నాయి? ఎందుకు ప్రాణంగా ప్రేమించుకున్న జంటలు విడిపోతున్నారు? జీవితాంతం కలిసి ఉండాలంటే ఏం చేయాలి? అని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో ఈ మూవీని తెరకెక్కించారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ బోల్డ్ లవ్ స్టోరీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Malcolm and Marie review: Netflix drama is stylish but pretentious

కథలోకి వెళ్తే…

లవ్ స్టోరీ అంటే ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే అందమైన రిలేషన్, ఒకరిపై ఒకరికి నమ్మకం అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీని మాత్రం రెండు రకాలుగా చూపిస్తారు. అందులో ఒక భాగం ఆనందంగా ఉంటే మరో భాగం వాళ్ల మధ్య నడిచే గొడవలన్న మాట. ముఖ్యంగా ఇందులో ఒక అమ్మాయి కోరుకున్న వాడు నెగ్లెక్ట్ చేస్తే ఎలా ఫీల్ అవుతుంది? తనను పట్టించుకోకుండా సక్సెస్ వైపు పరుగులు తీసే భాగస్వామి దొరికితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అనే విషయాలను క్లియర్ గా చూపించారు. ఈ సినిమాలో వరల్డ్ ఫేమస్ హీరోయిన్ జండా హీరోయిన్ గా నటించగా, జాన్ డేవిడ్ వాషింగ్టన్ హీరోగా కనిపించాడు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

స్టోరీ ఏంటంటే… ఇందులో హీరో పేరు మాల్కం. అతనొక ఫిలిం మేకర్. అయితే ఆయన తన ప్రేయసితో కలిసి ఉంటాడు. ఆయన తన సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోను చూసి ఇంటికి వస్తాడు. అయితే దానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకోవాలని ఆత్రుతతో వెయిట్ చేస్తాడు. కానీ ఇంటికి రాగానే మాల్కం మేరీ రిలేషన్ కి సంబంధించిన గొడవలు మొదలవుతాయి. ఆమెకేమో అతను తనను పట్టించుకోవట్లేదు అనే కోపం. దాన్నే మాటల ద్వారా వెళ్లగక్కుతుంది. అతడేమో ఆమె దెప్పి పొడిచే మాటలకు తట్టుకోలేడు. ఇద్దరికీ జీవితం నరకంగా మారుతుంది. ఇక ఇల్లు రణరంగమే.. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి నెలకొంటుంది. దాదాపుగా ఇద్దరి లవ్ స్టోరీకి ఒక గట్టి పరీక్ష ఎదురవుతుంది. మరి చివరికి జీవితం ఈ ప్రేమ జంటకు కాలం పెట్టిన పరీక్షలో వీళ్లిద్దరు నెగ్గారా? చివరకు ఒకటయ్యారా లేదా? అనే విషయాలు తెలియాలంటే మాల్కం అండ్ మ్యారీ అని మూవీనీ చూసి తీరాల్సిందే. అయితే ఇందులో కొన్ని బో*ల్డ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ గా చూస్తే బెటర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు