OTT Movie : ఫస్ట్ నైట్ ఫుల్లుగా తాగిసి ఎఫైర్ గురించి బయటపెట్టే భార్య… ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : ఇటీవల కాలంలో ఓటీటీలో కామెడీ సినిమాలకు ఆదరణ పెరిగింది. కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చి, ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం డైరెక్ట్ గా ఓటీటీ ప్రియులను అలరించడానికి ఓటిటిలోనే రిలీజ్ అవుతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు ఓటీటీలో కొత్త కంటెంట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలా తాజాగా రిలీజ్ అయిన ఓ మూవీ ఓటిటిని ఊపేస్తోంది. అయితే టైటిల్ ని చూసి బోల్డ్ మూవీ అనుకున్నారేమో అస్సలు కాదు. మంచి ఫన్ ఫిల్డ్ కామెడీ మూవీ. ఫ్యామిలీతో కలిసి చూడడానికి పర్ఫెక్ట్ మూవీ. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి అని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు ఓటీటీల్లో?

ఇటీవల కాలంలో ప్రేక్షకులు సినిమా చిన్నదా పెద్దదా అని ఆలోచించట్లేదు. కంటెంట్ ఉందనిపిస్తే చాలు వ్యూస్ తో కుమ్మేస్తున్నారు. అలా చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సాధించిన మలయాళ కామెడీ థ్రిల్లర్ సినిమాలలో మందాకిని కూడా ఒకటి. తమిళం, మలయాళ సినిమాలను చూసేవారికి కమెడియన్ అల్తాఫ్ సలీం గుర్తుండే ఉంటాడు. ఒకవేళ ఆయన పేరు తెలియకపోయినా ముఖాన్ని చూస్తే గుర్తుపడతారు. ఈ కమెడియన్ మందాకిని మూవీతో హీరోగా మారాడు. ఆయన సరసన హీరోయిన్ గా అనార్కలి మరికర్ నటించింది. జీరో బజ్ తో మే నెలలో థియేటర్లలోకి దిగిన ఈ మూవీ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ కావడానికి కథ, కామెడీ మెయిన్ గా హెల్ప్ చేశాయని చెప్పొచ్చు. కోటి రూపాయల బడ్జెట్ తో రూపొందిన మందాకిని బాక్స్ ఆఫీస్ వద్ద ఐదు కోట్లకు పైగా కొల్లగొట్టింది అంటే ఈ మూవీ లో ఉన్న కంటెంట్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మందాకిని మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోందని టాక్ జోరందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ మనోరమ మ్యాక్స్ లో టాప్ ట్రెండింగ్ సినిమాల లిస్ట్ లో చోటు దక్కించుకుంది. మరి హాట్స్టార్ లో ఎప్పుడు రాబోతోందో చూడాలి.

Mandakini On OTT: Release Date, Platform, Cast And Plot Of Malayalam Comedy  Drama

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఇందులో హీరో పేరు ఆరోమల్. హీరోయిన్ అంబిలి. ఇద్దరూ పెద్దల సమక్షంలో అరేంజ్డ్ మ్యారేజ్ ను వైభవంగా జరుపుకుంటారు. ఇక ఎట్టకేలకు ప్రతి జంట ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసే ఆ మూడు రాత్రుల రోజు రానే వస్తుంది. ఇలాంటి సమయంలో ఫ్రెండ్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అలాగే హీరో ఫ్యాన్స్ కూడా హీరోకు ఝలక్ ఇవ్వాలని అనుకుంటారు. అందులో భాగంగానే కూల్ డ్రింక్ లో మద్యం కలిపి అతనికి తెలియకుండానే తాగించే ప్లాన్ వేస్తారు. కానీ పొరపాటున ఆ డ్రింక్ హీరో భార్య తాగుతుంది. ఇంకేముంది తాగిన మైకంలో తన లవ్ ఎఫైర్, మాజీ ప్రియుడు చేసిన మోసంతో పాటు అన్ని విషయాలను భర్తకు పూసగుచ్చినట్టుగా చెప్తుంది. మరి ఆ టైంలో హీరో ఏం చేశాడు? తర్వాత భార్య పరిస్థితి ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ హిలేరియస్ మూవీని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు