OTT Movie : వేశ్య కూతురిపై మనసు పడే హీరో…. డబ్బు కోసం తల్లీ కూతుర్లు ఆటలు

OTT Movie : ప్రేమ ఎప్పుడు ఎవరిపై పుడుతుందో చెప్పడం చాలా కష్టం. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా ఏకంగా ఓ వేశ్య కూతురుపై మనసు పడతాడు హీరో. మరి ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

జీ5లో స్ట్రీమింగ్

టైటిల్ని చూసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ బోల్డ్ మూవీ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. టైటిల్ చదవడానికి అలాగే ఉన్నప్పటికీ ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ. నవలలను చదవడం అంటే చెవి కోసుకునే వారి కోసమే అన్నట్టుగా ఉంటుంది ఈ స్టోరీ. అయితే ఇదొక వెబ్ సిరీస్. అందులోనూ మోహన్ లాల్ హీరోగా నటించడం విశేషం. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే సాగుతుంది. కానీ చూస్తున్నంత సేపు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది.

స్టోరీ లోకి వెళ్తే…

పడవలో ప్రయాణిస్తున్న హీరోతో తన ఫ్రెండ్ తల్లి, చెల్లి గురించి చెడుగా చెప్పి చనిపోతాడు. ఆ తర్వాత హీరో అతని శవాన్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అతని అంత్యక్రియలు పూర్తయ్యాక తన దగ్గర ఫ్రెండ్ కు సంబంధించిన ఒక బాక్స్ ఉందని చెప్పి ఇంట్లో ఇవ్వడానికి వెళ్తాడు. ఈ క్రమంలోనే ఆ తల్లి చనిపోయేటప్పుడు కూడా నన్ను అసహ్యించుకున్నాడా అని అడిగి బాధపడుతుంది. హీరో కూడా దాదాపుగా వాళ్ళని అసహ్యించుకుంటాడు. కానీ ఒకానొక టైంలో నేను చేసిన తప్పేంటి అని హీరోయిన్ ప్రశ్నించడం అతన్ని ఆలోచనలో పడేస్తుంది. ఇక తీరా ఆ ఊరు నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్న హీరో హీరోయిన్ పై మనసు పడతాడు. కానీ ఊరంతా వాళ్ళిద్దరి గురించి చెడుగా మాట్లాడుకుంటుంది. తల్లి వేశ్య కావడంతో ఆమె కూతురు కూడా డబ్బుల కోసం ఏవేవో డ్రామాలు చేస్తారని అనుకుంటూ ఉంటారు. అయినప్పటికీ వినకుండా హీరో ఆమెతో ప్రేమలో పడతాడు.

- Advertisement -

Manorathangal" Olavum Theeravum (TV Episode 2024) - IMDb

ఇక అప్పటిదాకా ఒంటరి పక్షి అయిన హీరో పడవ మీద లేదా అడవుల్లో జీవనం సాగిస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ లైఫ్ లోకి వచ్చేసరికి తనకంటూ ఒక ఇల్లు కావాలని, డబ్బు కావాలని కోరుకుంటాడు. వాటిని సంపాదించడానికి వచ్చే వర్షాకాలంలోపు తిరిగి వచ్చేస్తానని హీరోయిన్ కి చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అంతలోనే విలన్ సూటు ౠటు ధరించి బస్సు కూడా లేని ఊరికి పడవలో వస్తాడు. అతని దగ్గర బాగా డబ్బు ఉందని ప్రచారం జరగడంతో హీరోయిన్ తల్లి అతన్ని హీరోయిన్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆలోచిస్తుంది. అతను కూడా హీరోయిన్ కి దగ్గర కావాలని చూస్తాడు. ఇక ఇదంతా తెలిసి హీరోకి విలన్ కి మధ్య గొడవ జరుగుతుంది. ఆమె మనసులో హీరోనే ఉన్నాడు అని తెలుసుకున్న విలన్ హీరోయిన్ ని రేప్ చేస్తాడు. అదే విషయాన్ని హీరో దగ్గర చెప్తాడు. మరి ఆ తర్వాత ఈ సిరీస్లో ఎలాంటి ట్విస్ట్ చోటు చేసుకుందో తెలియాలంటే మనోరతంగల్ అనే వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ఇది ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు