OTT Movie : సీరియల్ కిల్లర్ కే చుక్కలు చూపించే తల్లీకూతుర్లు… అదిరిపోయే సైకో థ్రిల్లర్ మూవీ

OTT Movie : గత కొంతకాలంగా కొరియన్ సిరీస్ లు సినిమాలకు ఇండియాలో ఎంత క్రేజ్ ఏర్పడింది అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పిచ్చి అనొచ్చు. ఓటిటిలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా ఈ కొరియన్ సినిమాలకు బాగా అడిక్ట్ అయిపోయారు. కానీ చాలామంది ఇప్పటికి కూడా కొరియన్ సినిమాలు, సిరీస్ లు అంటే కేవలం లవ్ స్టోరీలు అనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇందులో కూడా లవ్ స్టోరీ లతోపాటు అద్భుతంగా ఉండే ఎమోషనల్, సస్పెన్స్, యాక్షన్ డ్రామాలు కూడా ఉంటాయి. ఈరోజు మన మూవీ సజెషన్లో ఒక బెస్ట్ కొరియన్ యాక్షన్ డ్రామా గురించి చెప్పుకోబోతున్నాం. సినిమా నడుస్తున్న అంతసేపు ప్రతి సీన్ మిమ్మల్ని కథలో లీనమయ్యేలా చేస్తుంది. స్టోరీ పక్కనే జరుగుతుందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మరి ఈ మూవీ ఏ ఓటిటి లో అందుబాటులో ఉంది? అసలు ఈ మూవీని మీరు చూశారా లేదా? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

Midnight - Trailer © 2022 Thriller, Foreign, Action and Adventure

కథలోకి వెళ్తే…

ఈ సినిమా మొత్తం తల్లి కూతుర్లు జీవితం చుట్టూనే తిరుగుతుంది. అయితే వీళ్లను టార్గెట్ చేసిన ఓ సీరియల్ కిల్లర్ ని తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి ఎలా ఆటాడించారు అన్నదే స్టోరీ. స్టోరీలోకి వెళ్తే… ఈ సినిమాలో తల్లి కూతుర్లు ఇద్దరు కష్టపడి పని చేస్తారు. బాగా డబ్బు కూడా పెట్టుకుని ఓ మంచి వెకేషన్ కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకు తగ్గట్టుగానే కావలసినంత డబ్బును దాచుకుంటారు. అయితే ఆ తల్లి కూతుర్లు ఇద్దరు మూగవారు కావడం విశేషం. ఇద్దరికీ మాట్లాడడం రాదు. ఆ కుటుంబంలో తల్లీకూతుర్లు మాత్రమే ఉంటారు. అందుకే సైగలతోనే తాము అవతల వారికి చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతూ ఉంటారు. అయితే సంతోషంగా వెకేషన్ కి వెళ్దాం అనుకున్న ఈ తల్లి కూతుర్ల జీవితంలోకి ఒక సైకో కిల్లర్ అనుకోకుండా అడుగు పెడతాడు.

- Advertisement -

ఈ కిల్లర్ రాత్రి పూట అమ్మాయిలను టార్గెట్ చేసి తన వ్యాన్ లోకి ఎక్కించుకుని హత్యలు చేస్తాడు. అయితే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న హీరోయిన్ వెళ్లే రోడ్డులోనే సైకో మరో అమ్మాయి కోసం కాపు కాస్తాడు. ఆ అమ్మాయినీ కిడ్నాప్ చేయడంతో ఆమె హెల్ప్ కోరుతుంది. దీంతో ఆమెకు సహాయం చేయాలని అనుకున్న హీరోయిన్ సైకో చేతికి చిక్కుతుంది. ఆమె గురించి తెలుసుకున్న సైకో మొత్తానికి ఆమెతో పాటు ఆమె తల్లిని కూడా ఈ సైకో కిల్లర్ చంపాలని డిసైడ్ అవుతాడు. మరి ఆ తర్వాత అనుకున్నట్టుగానే సైకో తల్లి కూతుర్లు ఇద్దరిని చంపేశాడా? ఒకవేళ తప్పించుకుంటే వీళ్ళిద్దరూ ఆ సైకో కిల్లర్ నుంచి ఎలా తప్పించుకోగలిగారు? అనే విషయం తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మిడ్ నైట్ అని ఈ సినిమాపై ఓ లుక్కేయండి. ఒకవేళ ఇంకా ఈ సూపర్ సస్పెన్స్ మూవీని చూడకపోతే మంచి మూవీని మిస్ అవుతున్నట్టే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు