OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా రోడ్లపై తిరిగే తింగరి జంట… ఈ బో*ల్డ్ మూవీ ఓటీటిలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

OTT Movie : తెలిసీ తెలియని వయసులో జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎన్నో కలలు కంటాము. కానీ తీరా వయసు వచ్చేసరికి ఉద్యోగం, పెళ్లి, పిల్లలు.. ఇలా బరువు బాధ్యతలతో అన్ని కలలను పక్కన పెట్టేస్తాము. జస్ట్ రొటీన్ లైఫ్ తో ఇదే జీవితం అని సరిపెట్టుకుంటాము. 9-5 జాబ్, అలారం పెట్టుకుని మరీ ఉదయాన్నే లేవడం, హడావిడిగా ఆఫీస్ కి వెళ్లడం, 9 నుంచి 6 వరకు ఆఫీస్ లో పనితో కుస్తీ పడడం, ఆ తర్వాత ట్రాఫిక్ తో, చివరకు ఇంటికి వచ్చి తిని పడుకోవడం. ఇలాగే ఉంటుంది రొటీన్ లైఫ్. కానీ కొంతమందికి ఇది అసలు జీవితమే కాదు… ఎలా కావాలంటే అలా బ్రతికితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఒకానొక సందర్భంలో. అయితే దాన్నే ఈ సినిమాలో స్టోరీ లైన్ గా తీసుకున్నారు డైరెక్టర్. మరి ఈ క్రేజీ లవ్ స్టోరీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం పదండి.

ఓటిటిలో కాదు వెబ్ సైట్ లో

ఈ మూవీ ఓటిటీలో కాకుండా ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. అయితే టైటిల్లో ఉన్నట్టుగానే ఈ మూవీ బో*ల్డ్ గా ఉంటుంది. కాబట్టి సోలో వాచింగ్ సో బెటర్ అని మర్చిపోకండి. ఇక అసలు విషయానికొస్తే ఈ మూవీ పేరు మండే.

Movie Review: Hook up on Friday, make it last until “Monday” | Movie Nation

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఓ జంట తప్ప తాగేసి ఒంటిపై నూలు పోగు లేకుండా బీచ్ లో పడుకుని పోలీసుల కంటికి చిక్కుతారు. అయితే నిజానికి వీళ్ళిద్దరికీ అసలు పరిచయమే ఉండదు. కానీ బీచ్ లో మాత్రం ఒకరినొకరు హగ్ చేసుకుని మరీ పడుకుంటారు. ఈ వింత సీన్ చూసిన పోలీసులు షాక్ అయ్యి వాళ్ళని పోలీస్ స్టేషన్ కు పట్టుకెళ్తారు. అలా వెళ్తూ వెళ్తూ ఇద్దరూ పోలీస్ కార్లోనే పరిచయం చేసుకుంటారు. ఇంకేముంది ఆ జంట మధ్య మాటలు కలిసి, ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇక ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీలో ఇద్దరూ తింగర పనులు చేయడానికి ఇష్టపడతారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. తాగేసి రోడ్లమీద గోల చేయడం, ఇద్దరు కలిసి బండి మీద నైట్ అంతా షికారు చేయడం, క్లబ్బులు, పబ్బులు, పార్టీలు, ఒంటి మీద నూలు పోగు లేకుండా తిరగడం… ఒక్కటేమిటి మనిషన్నవాడు చేయలేని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మొత్తానికి ఇద్దరికీ ఒకరిపై ఒకరికి పిచ్చి ప్రేమ మొదలవుతుంది. కానీ ఇక్కడే మొదలవుతుంది అసలు ట్విస్ట్. విషయం ఏంటంటే వెకేషన్ కోసం వచ్చిన హీరోయిన్ అక్కడ్నుంచి వెళ్లిపోయే టైం వచ్చేస్తుంది. ఇదంతా హీరోకి చెప్పకుండా ఇన్ని రోజులు తనతో ఇంత హ్యాపీగా హీరోయిన్ ఎందుకు ఉంది? చివరికి అతని వదిలేసి వెళ్లిపోయిందా? వీరిద్దరి లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎలాంటి మలుపు తిరిగింది ? అనే విషయాలు తెలియాలంటే మండే అనే ఈ మూవీనీ తెరపై చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు