OTT Movie : ఆ పని కోసం వయసైపోయిన ప్రెసిడెంట్ పాట్లు… చూశారంటే పొట్ట చెక్కలే

OTT Movie : ప్రతివారం ఓటిటి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సినిమాలకు మాత్రమే ముందుగా రిలీజ్ డేట్ తో పాటు ప్రమోషన్స్ కూడా చేస్తారు. చాలా సినిమాలు సైలెంట్ గా ఓటీటీలోకి వస్తాయి. అలా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ ఏ ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

టైటిల్ ను చూసి బో*ల్డ్ మూవీ అనుకున్నారేమో. ఇది కంప్లీట్ కామెడి ఎంటర్టైనర్. పైగా కన్నడ మూవీ. ఈ మూవీ పేరు మూరనే కృష్ణప్ప. పొలిటికల్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీ మే నెలలో థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీ కథ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు కమర్షియల్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో సంపత్ మైత్రేయ, రఘు, శ్రీ ప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. నవీన్ నారాయణఘట్ట దర్శకత్వం వహించగా, పల్లెటూరి రాజకీయాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించి ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు డైరెక్టర్. ఇక థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ జూలై 19 నుంచి సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Moorane Krishnappa (2024) | Moorane Krishnappa Kannada Movie | Movie  Reviews, Showtimes | nowrunning

- Advertisement -

కథలోకి వెళ్తే…

వీరన్న అనే వ్యక్తి అనేకల్ అనే గ్రామానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా పని చేస్తాడు. అయితే ఆయన పదవీ కాలం పూర్తవడంతో ఇంకోసారి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటాడు. అందుకోసం పోటీకి సిద్ధమవుతాడు. కానీ జనాలను తన వైపుకు తిప్పుకోవడానికి కొత్త స్ట్రాటజీని ఆలోచిస్తాడు. ఆ ఊర్లో ఉన్న కొత్త గుడి ఓపెనింగ్ కి స్టార్ హీరోను పిలిపించి తన పలుకుబడి, గొప్పతనం ఊరి ప్రజలందరి ముందు చూపించాలని డిసైడ్ అవుతాడు. అనుకున్న విధంగా హీరోను పిలుస్తాడు కూడా. కానీ కరెక్ట్ గా మూడు రోజుల్లో గుడి ఓపెనింగ్ ఉండగా ఆ హీరో చనిపోతాడు. దీంతో వేరే హీరోను తీసుకురావాలని ప్లాన్ చేసినా వర్కౌట్ కాకపోవడంతో ఏకంగా సీఎంనే ఆ పని కోసం రంగంలోకి దింపాలని డిసైడ్ అవుతాడు. మరి సీఎంను ఊరికి రప్పించడానికి అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఎన్నికలలో వీరన్న గెలిచాడా? అసలు చివరకు స్టోరీకి ఎండ్ కార్డ్ ఎలా పడింది? అనే విషయాలు తెలియాలంటే తెరపై ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు