OTT Movie : ఆ పని చేస్తూ వీడియో తీసుకున్న ఫోన్ మిస్… తెలుగులోనే ఈ 18+ మూవీ

OTT Movie : ఈరోజు మన మూవీ సజెషన్ తెలుగు బో*ల్డ్ మూవీ. సాధారణంగా బో*ల్డ్ అనగానే ఇతర భాషలోని సినిమాలని ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే మన తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు ఉన్నాయి. కానీ కంప్లీట్ గా బో*ల్డ్ మాత్రమే కాకుండా కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను కూడా ఈ జానర్ లో తీస్తూ ఉంటారు మన దర్శకనిర్మాతలు. ఈరోజు ఓ జంట చేసే ఒక పొరపాటు వల్ల రెండు కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ పేరేంటి? అనే వివరాల్లోకి వెళితే…

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

రొమాంటిక్ లైఫ్ లో ఎన్నో ఫ్యాంటసీస్ ఉంటాయి. ఇక కొత్త తరం యూత్ కు ఉండే ఫ్యాంటసీలలో తాము రొమాన్స్ చేస్తున్నప్పుడు ఫోన్ లో బంధించడం అనేది కూడా ఒకటి. పరిస్థితులు తర్వాత ఎలా ఉంటాయో ఆలోచించకుండా అప్పటికైతే ఓ మధుర జ్ఞాపకంగా ఉంటుంది అనే ఆలోచనతో ఈ పిచ్చి పని చేయాలనుకుంటారు. కానీ ఒక్కసారి ఆ ఫోన్ మిస్ అయితే ఏం జరుగుతుంది? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ. పక్కా ఏ సర్టిఫికెట్ మూవీ కాబట్టి ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ పేరు మిస్టర్ అండ్ మిస్. పెద్దగా తెలిసిన నటీనటులు ఏమీ కాదు. కానీ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. ఈ మిస్టర్ అండ్ మిస్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సన్నివేశాలు మాత్రమే కాదు కొన్ని డైలాగులు కూడా బోల్డ్ గా ఉంటాయి కాబట్టి మూవీని చూసేటప్పుడు జాగ్రత్త.

Mr & Miss' Trailer: Of fun & a bedroom video that can get leaked - Tamil News - IndiaGlitz.com

- Advertisement -

కథలోకి వెళ్తే…

అమలాపురానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. కానీ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల అతనికి జాబ్ ఊడిపోయే పరిస్థితి నెలకొంటుంది. అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ పరిచయమై ఇంగ్లీష్ నేర్పిస్తాను అని భరోసా ఇస్తుంది. ఇంకేముంది ఇద్దరి మధ్య స్నేహం పెరిగి, అది ప్రేమగా చిగురుస్తుంది. కానీ హీరోయిన్ అప్పటికే ఒక అబ్బాయిని లవ్ చేసి, బ్రేకప్ చెప్పేస్తుంది. ఆ బాధలో ఉన్న హీరోయిన్ కి హీరో మంచితనం బాగా నచ్చి వెంటనే కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరి రిలేషన్ మాటలతో ఆగిపోకుండా బెడ్ వరకు వెళ్తుంది. ఇక్కడే అసలు తప్పు చేస్తారు ఈ జంట. ఫస్ట్ టైం మీట్ అవుతున్నారు కాబట్టి ఆ అనుభూతి ఎప్పటికీ గుర్తుండి పోవాలి అనే ఆలోచనతో రొమాన్స్ అంతా ఫోన్లో రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఫోన్ పోతుంది. మరి ఆ ఫోన్ మిస్ అయ్యాక ఈ జంట ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఆ ఫోన్ ఎవరికి దొరికింది? రెండు కుటుంబాల మధ్య ఈ ఫోన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే మిస్టర్ అండ్ మిస్ మూవీ పై ఓ లుక్కెయ్యండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు