OTT Movie : కట్నం కోసం పెళ్లి చేసుకుని రాత్రికి రాత్రే జంప్ అయ్యే వరుడు.. అన్ని మతాలు కవర్ 

OTT Movie : మలయాళ సినిమాలకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు మలయాళ మేకర్స్. అందుకే తమదైన శైలిలో సినిమాలు, వెబ్ సిరీస్ లో చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన ఒక కామెడీ వెబ్ సిరీస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. మరి ఈ మలయాళ కామెడీ థ్రిల్లర్ మూవీ స్టోరీ ఏంటి ? పేరేంటి ? అనే విషయంపై లుక్కేద్దాం పదండి.

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న వెబ్ సిరీస్ పేరు నాగేంద్రన్ హనీమూన్స్. 6 ఎపిసోడ్లు మాత్రమే ఉన్న ఈ వెబ్ సిరీస్ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా హిలేరియస్ గా నవ్విస్తోంది. ఇక చివరకు వచ్చే ట్విస్ట్ అయితే ప్రేక్షకులకు మంచి కిక్కిస్తోంది. ఇందులో నాగేంద్ర అనే పాత్రలో మలయాళ నటుడు సూరజ్ నటించగా, ఐదుగురు భార్యల పాత్రలో పాత్రలో ఐదుగురు హీరోయిన్లు నటించారు.

Nagendran's Honeymoons review: Suraj Venjaramoodu, Kani Kusruti's Hotstar  series oversimplifies and humorises marriage fraud | Web-series News - The  Indian Express

- Advertisement -

స్టోరీలోకి వెళ్తే…

సోమరిపోతు అయిన హీరో నాగేంద్రనన్ ముసలి తల్లి సంపాదనతోనే బద్ధకంతో బతుకుతాడు. ఇక ఇలాంటి టైంలో కువైట్ కి వెళ్ళి తన స్నేహితుడు తిరిగి రావడంతో అతని లైఫ్ స్టైల్ చూసి తనకు కూడా డబ్బులు సంపాదించాలని ఆశపడుతుంది. కానీ కువైట్ కి వెళ్లాలంటే తన దగ్గర డబ్బు ఉండాలి. అంత డబ్బు లేకపోవడంతో తన మామ కూతురిని పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందనే ఆశతో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ కట్నం మాత్రం ఏమీ రాదు. దీంతో అమ్మాయిని అక్కడే వదిలేసి తన ఫ్రెండ్ తో వేరే ఊరికి పారిపోతాడు. వేరే ఊర్లో తన చెల్లికి పెళ్లి కావట్లేదని బాధపడుతున్న పోలీస్ ఆఫీసర్ కు జోసెఫ్ అనే పేరుతో పరిచయం చేసుకుంటాడు. అయితే ఆ పోలీస్ అనాధ పేరుతో తన చెల్లిని అతనికిచ్చి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత రోజు చుట్టాలకు బాలేదని చెప్పి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు తీసుకుని మరో ఊరికి పారిపోతాడు నాగేంద్ర.

అయితే అక్కడ ముస్లిం అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్లి చేసి ప్రభుత్వం డబ్బులిస్తుందన్న విషయం తెలుస్తుంది. ఇంకేముంది ఆలీ జోసెఫ్ అనే పేరు మార్చుకొని లైలా సుల్తానా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ డబ్బులు లైలా ఎకౌంట్లోనే పడతాయి. దీంతో అక్కడి నుంచి కూడా పారిపోతాడు. అయితే వీరి పెళ్లి ఫోటో వార్తల్లో రావడంతో పోలీస్ ఆఫీసర్ ఇతన్ని వెతికే పనిలో పడతాడు. అప్పటికే మరో ఊర్లో సావిత్రి అనే బ్రాహ్మణ అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు నాగేంద్రన్. అయితే అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసి ఆ ఊర్లో నుంచి కూడా పారిపోతాడు. మరో ఊర్లో తంగం అనే వేశ్యను పెళ్లి చేసుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తామని ఆ ఊరి వాళ్ళు చెప్పడంతో ఈ పని చేస్తాడు. కానీ ఆ డబ్బులు తంగమే తీసుకుంటుంది. ఇక చివరగా మొరి అనే అమ్మాయితో జరిగే పెళ్లితో నాగేంద్ర జీవితంలో ట్విస్ట్ వస్తుంది. అదేంటో తెలియాలంటే ఈ మూవీని తెరపై చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు