OTT Movie : ఆ ఇంట్లోకి వెళ్ళారంటే వెనక్కి రారు… భయంతో పక్క తడిపించే హార్రర్ మూవీ

OTT Movie : హారర్ సినిమాలు అంటే రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. ఈ జానర్ లో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అయితే కొన్ని ఇంట్రెస్ట్ కు మించి పక్క తడిపేసేంతగా భయపెడతాయి. ఇలాంటి భయంకరమైన సినిమాలను చూడాలి అనుకునే వారి కోసమే ఈరోజు మన ఈ మూవీ సజెషన్. మరి అంతగా భయపెట్టే ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలపై లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. హర్రర్ మూవీ లవర్స్ పొరపాటున కూడా మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది. భార్గవి నిలయం అనే మలయాళ బ్లాక్ బస్టర్ హారర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ. ఈ ఒరిజినల్ మూవీ 1964లో మలయాళంలో రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న హర్రర్ మూవీ పేరు నీల వెలిచం. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే ఓ అమ్మాయి అనుకోకుండా చనిపోయి తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ట్రై చేయడమే ఈ మూవీ స్టోరీ. అయితే ఆ ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఓ పాడుబడిన బిల్డింగ్ లో దెయ్యంగా తిరుగుతూ అందరిని భయపెడుతుంది. ఇది ఒక రొటీన్ స్టోరీ లైన్ అయినప్పటికీ క్లైమాక్స్ మాత్రం ఊహించని రేంజ్ లో ఉంటుంది. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రస్తుతం ట్రెండీగా మారిన మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ ఇది. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ మూవీని చూడకపోతే కచ్చితంగా ఓ లుక్కెయ్యండి.

Neelavelicham: New Poster From Tovino Thomas, Rima Kallingal, Roshan Mathew, Shine Tom Chacko's Romantic–Horror Drama Unveiled! | 🎥 LatestLY

- Advertisement -

కథలోకి వెళ్తే…

సాధారణంగా రచయితలు ప్రశాంతంగా కథలు రాసుకోవడం కోసం ఒక్కోసారి ఒక్కో ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అలాగే ఈ సినిమాలోని రచయిత పేరు బషీర్. స్టోరీ రైటింగ్ కోసం ఓ పల్లెటూర్లో సముద్రం ఒడ్డున ఉండే భార్గవి నిలయం అనే పాడుబడిన బిల్డింగ్ లో రెంట్ కి దిగుతాడు. కానీ నిజానికి అది ఊరి చివరన ఉండే భయంకరమైన ఇల్లు. పైగా అందులో భార్గవి అనే అమ్మాయి దెయ్యంగా తిరుగుతుందని అందరూ కథలుకథలుగా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమందికి ఆ దెయ్యం నిజంగానే కనిపిస్తుంది కూడా. పైగా ఆ ఇంట్లోకి ఎవరైనా అడుగుపెడితే మళ్లీ వెనక్కి రారు. కానీ స్టోరీ రైటింగ్ కోసం ఆ ఇంటికెళ్లిన బషీర్ ను ఆ దయ్యం అసలు ఏమీ చేయదు. అయితే ఈ క్రమంలోనే బషీర్ దయ్యం ఎందుకు చనిపోయింది అనే కారణాన్ని తన కథగా రాయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతకీ ఆ భార్గవి ఎవరు? ఎందుకు, ఎలా చనిపోయింది? ఆమె చావు వెనకున్న మిస్టరీ ఏంటి? ఆమె ఎవరిపై పగ తీర్చుకోవాలి అనుకుంటుంది? ఎవరైనా ఇంట్లోకి వచ్చారంటే చావే అన్నట్టుగా ఉండే ఆ దయ్యం రైటర్ ని మాత్రం ఎందుకు ఏం చేయలేదు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని వీక్షించండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు