OTT Movie : సైకో కిల్లర్ కోసం వేశ్యగా మారిన తెలుగు హీరోయిన్… పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : తెరపై వేశ్య పాత్రలను పోషించాలంటే హీరోయిన్లకు ధైర్యం ఉండాలి. నిజానికి ఇలాంటి పాత్రలు అందరికీ సెట్ కావు. ఆ పాత్రతో పాటు అద్భుతమైన కంటెంట్ ఉంటేనే సినిమా హిట్ అవ్వడంతో పాటు అందులో వేశ్య పాత్రను పోషించిన హీరోయిన్లకు మంచి గుర్తింపు దక్కుతుంది. ఉదాహరణగా అనుష్క చేసిన వేదం మూవీనే తీసుకోవచ్చు. అందులో స్వీటీ నటించిన తీరు, ఆమె పాత్ర ఎవర్ గ్రీన్. అయితే ఈ జానర్ లో వచ్చిన కొన్ని సినిమాలు అసలు రిలీజ్ అయ్యాయి అన్న విషయం కూడా పెద్దగా తెలీకుండా పోతోంది. అలా ఓ తెలుగు హీరోయిన్ సైకో కిల్లర్ కోసం వేశ్యగా మారిన మూవీ గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. మరి పిచ్చెక్కించే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ టైటిల్ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు నిరీక్షణ. ఇందులో తెలుగు హీరోయిన్ శ్రద్ధ దాస్ హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈ మూవీ రిలీజ్ అయింది అన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. ఇక ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఈ మూవీని ఫ్రీగా చూసే అవకాశం మాత్రం లేదు. 99 రూపాయలకు రెంట్ కట్టి రెంటల్ బేసిస్ లో చూడాల్సి ఉంటుంది.

Shraddha Das did a bold photoshoot in a very deep neck dress, pictures went  viral - informalnewz

- Advertisement -

కథలోకి వెళ్తే…

సినిమాలో అజయ్ ఘోష్ అమ్మాయిల సప్లయర్. అందమైన అమ్మాయిలతో ఈ వృత్తిలో రెండు చేతులా సంపాదిస్తాడు. ఫోన్ కొట్టు అమ్మాయిని పట్టు అన్నట్టుగా ఎవరైనా కాల్ చేస్తే చాలు అమ్మాయిలను పంపేస్తాడు. తనకు డబ్బు మాత్రమే ముఖ్యం అన్నట్టుగా ఉంటాడు. ఓ రోజు తెలియని వ్యక్తి నుంచి అతనికి ఫోన్ వస్తుంది. అయితే అజయ్ తనకి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనే వివరాలు తెలుసుకోకుండా అమ్మాయిని పంపిస్తాడు. కానీ ఆ అమ్మాయి తిరిగి రాదు. చాలాసార్లు ఇలాగే రిపీట్ అవ్వడంతో వరుస హత్యలను చేస్తున్న వాడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇక శ్రద్ధ దాస్ కూడా ఆ సైకో కిల్లర్ ను పట్టుకోవడానికి ఏకంగా వ్యభిచారిణిగా మారుతుంది. కానీ ఆమె ప్రయత్నాలు ఏమీ ఫలించవు. ఆ తర్వాత అతి కిరాతకంగా హీరోయిన్ ను చంపడానికి ఈ సైకో కిల్లర్ ప్లాన్ చేస్తాడు. అయితే అంతలోపే పోలీసులు వాడిని పట్టేసుకుంటారు. కానీ అతను పోలీసుల దగ్గర నోరు విప్పడు, ఎందుకు హత్యలు చేస్తున్నాడో చెప్పడు. మరి ఈ సైకో కిల్లర్ ఎందుకు వేశ్యలనే టార్గెట్ చేసి చంపుతున్నాడు ? ఇతని వల్ల ఇప్పటి దాకా ఎంత మంది చనిపోయారు ? హీరోయిన్ ని హీరో కాపాడగలిగాడా ? అసలు సైకో కిల్లర్స్ ని ఎలా పట్టుకున్నారు ? వంటి విషయాలు తెలియాలంటే నిరీక్షణ మూవీని చూడాల్సిందే. కాకపోతే కొంతమంది యాక్టింగ్ ని చూడడమే కష్టంగా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు