OTT Movie : అమ్మాయి శవం పక్కనే తమన్నా తండ్రి… చివరిదాకా వీడని సస్పెన్స్

OTT Movie : ప్రస్తుతం ఓటిటిలకు డిమాండ్ ఎంతగా పెరిగిందంటే స్టార్ హీరో హీరోయిన్లు కూడా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఓటిటిలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమన్నా, రాశి ఖన్నా, సమంత, ప్రియమణి లాంటి స్టార్ హీరోయిన్లకు ఓటీటీ అడ్డాగా మారింది. వీళ్ళంతా ఓటీటీ కారణంగా మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. అడ్డు, అదుపు లేకుండా హాట్ సీన్లలో నటించి తమన్నా, సమంతా అయితే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపారు. కానీ కరోనాకు ముందు పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉండేది. అప్పట్లో ఓటీటీలకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అలాంటి సమయంలోనే తమన్నా ఓటిటీలోకి అడుగు పెట్టి ఓ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ లో నటించింది. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను తెలుసుకుందాం.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ పేరు నవంబర్ స్టోరీ. తమన్నా ఇప్పటిదాకా చాలా వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ అందులో ముందు నటించింది మాత్రం లెవెన్త్ అవర్, ఆ తర్వాత నవంబర్ సిరీస్. మనం ఇప్పటికే మూవీ సజెషన్ లో లెవెన్త్ అవర్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నవంబర్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ చివరి వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.November Story - Trailer - Disney+ Hotstar

కథలోకి వెళ్తే…

తమన్నా ఈ సిరీస్ లో ఒక ప్రొఫెషనల్ ఎథికల్ హ్యాకర్ గా కనిపిస్తుంది. తన ఫ్రెండ్ కు హెల్ప్ చేస్తుండగా సాఫ్ట్వేర్ హ్యాక్ అవుతుంది. ఇక ఇంకో వైపు తమన్నా తండ్రి ఓ ప్రొఫెషనల్ క్రైమ్ స్టోరీ రైటర్ కాగా, అతన్ని ఓ అంతు చిక్కని వ్యాధి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినప్పటికీ తను చచ్చేలోపు రాస్తున్న నవలను కంప్లీట్ చేయాలని పట్టుబడతాడు. ఇక తండ్రి ఆరోగ్యం బాగుపడాలంటే తలకు మించిన భారం అవుతుందని తెలుసుకున్న తమన్నా, తండ్రి కి సంబంధించిన ఓ పాత బిల్డింగ్ ను అమ్మాలని ఫిక్స్ అవుతుంది.

- Advertisement -

అయితే అదే సమయంలో ఆ బిల్డింగ్ లో ఓ మహిళ చనిపోతుంది. ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన అమ్మాయి పక్కనే తమన్నా తండ్రి ఉంటాడు. అయితే బిల్డింగ్ ను చూడ్డానికి వచ్చిన తమన్నా ఇదంతా చూసి తన తండ్రిని అక్కడి నుంచి ముందుగా పంపించేస్తుంది. ఆ తర్వాత హత్య గురించి పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది. మరి తన ఫ్రెండ్ ఆఫీసులో సాఫ్ట్వేర్ హ్యాక్ అవ్వడానికి, తండ్రికి సంబంధించిన పాత బిల్డింగ్ లో హత్య జరగడానికి లింక్ ఏంటి? అమ్మాయి శవం పక్కనే తమన్నా తండ్రి ఎందుకు ఉన్నాడు? ఈ హత్య కేసు నుంచి ఆయన బయట పడ్డాడా ? తమన్నా ఈ పరిస్థితిని ఎలా చక్కబెట్టింది ? అనే విషయాలు తెలియాలంటే నవంబర్ స్టోరీని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు