OTT Movie : కొడుకును లవ్ చేసి తండ్రితో బెడ్ షేర్… బో*ల్డ్ సీన్స్ తో బుర్రపాడవ్వాల్సిందే

OTT Movie : టైటిల్ లో చూసినట్టుగా ఇదొక బో*ల్డ్ మూవీనే. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు ఎలా కుప్పకూలిపోతున్నాయో మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ సమాజంలో రోజురోజుకూ ఎఫైర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. ఇలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని ఇప్పటిదాకా మన కళ్ళ ముందుకు వచ్చిన సినిమాలు ఎన్నో ఎన్నెన్నో. కానీ అందులో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు మాత్రం కొన్నే ఉంటాయి. ఆ కొన్నింటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అని వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నా మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీలో బుర్ర పాడు చేసే బో*ల్డ్ సన్నివేశాలు కావలసినన్ని ఉన్నాయి. అంటే ప్యూర్ లస్ట్ మూవీ. కాబట్టి ఫ్యామిలీతో కాకుండా ఈ మూవీని సింగిల్ గా చూస్తేనే బెటర్. ఈ మూవీ పేరు అబ్సెషన్. పేరుకు తగ్గట్టుగానే ఇది ఒక హాలీవుడ్ మూవీ. అయితే భాష అడ్డు కాదు అనుకునే వారు ఈ మూవీని సరదాగా చూడొచ్చు.

Obsession (2023) – Review | Netflix Series | Heaven of Horror

- Advertisement -

కథలోకి వెళ్తే…

పెళ్లిని ప్రతి జంట ఎంతో పవిత్రంగా భావిస్తుంది. కానీ అలాంటి పెళ్లి జరిగాక వెకిలి వేషాలు వేస్తే మన దగ్గర అయితే తాటతీస్తారు. ఇక ఇలాంటి విషయాల్లో ఒక్కో దేశంలో ఒక్కో చట్టం ఉంటుంది. ఇక కథలోకి వెళ్తే సినిమాలో హీరో అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమెను మనస్ఫూర్తిగా ఇష్టపడి, తననే జీవిత భాగస్వామిగా చేసుకోవాలని పెళ్లికి రెడీ అవుతాడు. ఇంకేముంది వాళ్ళ కల్చర్ లో భాగంగా అమ్మాయిని తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తాడు. ఇక్కడ స్టోరీ ఇంట్రెస్టింగ్ టర్న్ తిరుగుతుంది. హీరో తండ్రి తనకు కాబోయే కోడలుపై మోహం పెంచుకుంటాడు. ఇదే పెద్ద మిస్టేక్. మరి ఆ అమ్మాయి ఏమన్నా మంచిదా అంటే అస్సలు కాదు. ఇద్దరూ కలిసి ఒకానొక సమయంలో కిచెన్ లో చేతులు పొరపాటున టచ్ అవ్వడంతో ఓ షాక్ లాంటి ఫీల్ లోకి వెళ్లిపోతారు. ఇంకేముంది ఇద్దరి మనసులోనూ కోరి*కలు గాఢంగా ఉండడంతో ఓవైపు కొడుకుని ఇష్టపడుతూ, మరోవైపు తనపై కోరికలు పెంచుకున్న మామతో బెడ్ షేర్ చేసుకుంటుంది పాప. ఫ్యామిలీకి తెలియకుండా ఇద్దరూ హద్దులు దాటి రొమాన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇదంతా తెలియని ఆ కొడుకు మాత్రం ఆ అమ్మాయితో తన భవిష్యత్తును అందంగా ఊహించుకుంటూ కలలో తేలిపోతాడు. మరోవైపు హీరో తండ్రి ఇలా తన కాబోయే కోడల్ని వాడుకుంటూ కొడుకును, తన భార్యను చీట్ చేస్తాడు. ఒకానొక సందర్భంలో అసలు విషయం తెలిసి హీరో హార్ట్ బ్రేక్ అవుతుంది. మరి ఆ తర్వాత హీరో తండ్రి, హీరోయిన్ పరిస్థితి ఏమైంది? చివరికి ఈ కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అబ్సేషన్ మూవీ చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు