OTT Movie : రొమాన్స్ ఎలా చేయాలో నేర్పించే మూవీ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : సాధారణంగా సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా భార్య భర్తలు, లవర్స్ తరచుగా గొడవలు పడడం చూస్తూనే ఉంటాము. అయితే ఎంత ఎక్కువగా గొడవపడితే అంత ఎక్కువగా ఆ జంట మధ్య ప్రేమ ఉంటుంది. ఇలాంటి పాయింట్ తో తెరకెక్కిన మూవీనే ఈరోజు మనం మూవీ సజెషన్. టైటిల్ ను చూస్తే బో*ల్డ్ మూవీలా ఉంది. కానీ కంటెంట్ అది కాదా అని నిరాశ పడిపోకండి. మీకు కావాల్సిన ఆ అంశంతో పాటే మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా లవర్స్ కు, రిలేషన్ షిప్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది ? టైటిల్ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు వన్ డే. సాధారణంగా రొటీన్ లవ్ స్టోరీలాగా కాకుండా ఇందులో ప్రేమలో పడడం దగ్గర నుంచి ఆ రిలేషన్ నెగిటివ్ గా మారడం వరకు చూపించారు. రిలేషన్షిప్ లో జంటలు చేసే తప్పులే ఇందులో మెయిన్ స్టోరీ. ముఖ్యంగా లవ్ లో ఉన్న వాళ్లు, భార్యాభర్తలకు తమ రొమాంటిక్ లైఫ్ ఎలా ఉండాలి, ఉండకూడదు అనే విషయంపై ఒక అవగాహన కల్పించేలా ఉంటుంది.

Watch One Day | Prime Video

- Advertisement -

కథలోకి వెళ్తే..

రొమాంటిక్ లవ్ స్టోరీ అనగానే హీరోయిన్ హీరో ప్రేమలో పడడం దగ్గర నుంచి ఏ మూవీ అయినా స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అంతే. అయితే ముందుగానే ప్రేమ దోమ అనకుండా ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న డేటింగ్ ను స్టార్ట్ చేస్తారు హీరో హీరోయిన్. ఆ తర్వాత నెమ్మదిగా ఒకరినొకరు తెలుసుకోవడం, ఇష్టపడడం మొదలవుతుంది. ఇద్దరూ ఫస్ట్ ఎట్ సైట్ లోనే ఇష్టపడి, డేటింగ్ తర్వాత ఒకరినొకరు వదిలి ఉండలేము అన్నంతగా ప్రేమలో పడతారు. అయితే దగ్గరయ్యాకే అసలు కథ మొదలవుతుంది.

కొన్నాళ్ళు హీరో హీరోయిన్ మధ్య అంతా బాగానే ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఓ పండంటి బిడ్డ కూడా పుడుతుంది. ఇక్కడి నుంచి మొదలు ఇద్దరూ ఒకరికొకరు శత్రువులేమో అన్న విధంగా గొడవపడతారు. పరిస్థితి ఎలా మారుతుంది అంటే పలకరిస్తే వాదనే అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఇద్దరూ ఒకచోట ఉండలేరు అన్నట్టుగా మారిపోతారు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే అంత గాఢంగా ప్రేమలో పడ్డ ఈ జంట మధ్య అసలు ఏం జరిగింది? ఆ గొడవ ఎక్కడికి దారి తీసింది? చివరికి ఈ జంట తమ బిడ్డను ఏం చేశారు? అనే విషయాలు తెలియాలంటే మూవీని నెట్ ఫ్లిక్స్ లో చూసి తీరాల్సిందే. చివరిదాకా ఈ మూవీని చూడాలి అనిపించేలా చేసేది అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది అని ఒకే ఒక్క పాయింట్. అలాగే మధ్యమధ్యలో మసాలా సీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి లవర్స్, భార్యాభర్తలు ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు