OTT Movie : ఫోటోలు దిగడం అంటే పిచ్చా? ఈ కొత్త కాన్సెప్ట్ మూవీ చూస్తే కెమెరా అంటేనే పారిపోతారు

OTT Movie : ఫోను అరచేతుల్లోకి వచ్చేసాక చాలా మందికి ఫోటోలు అంటే పిచ్చి పట్టుకుంది. ఏం చేస్తున్నా సరే సెల్ఫీలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందించడం పక్కా. ఒకవేళ ఫోటోలు దిగట్లేదు అంటే ఏదో వింత రోగం అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక మరికొంత మందికి ఈ ఫోటోల పిచ్చి పెరిగి పిచ్చి పిచ్చి స్టంట్లు చేస్తూ ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈరోజు మూవీ సజెషన్ ఇలా ఫోటోలు దిగేవారి కోసమే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? టైటిల్ ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…

ఫ్రీగా మాత్రం చూడలేరు

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న థ్రిల్లర్ మూవీ చూడడానికి ఫ్రీగా అందుబాటులో లేదు. ఇప్పుడు ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా, రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీని చూడాలి అనుకునేవారు రూ.119 పే చేసి చూడాల్సిందే. అయితే గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ మూవీని ఫ్రీగా చూసే అవకాశం కూడా ఉంది. ఎక్కడంటే ఇంకెక్కడ యూట్యూబ్లో. ఇక ఈ సినిమా పేరు వన్ అవర్ ఫోటో. ఈ సినిమాను చూశారంటే కెమెరా పేరు చెప్పినా సరే పారిపోతారు. ఈ సినిమాను చూశాక భయం పెరిగిపోతుంది. ఎవరైనా మనల్ని వెంబడిస్తున్నారేమో అనే టెన్షన్ మాటిమాటికి కలుగుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటించిన హీరో రాబిన్ విలియమ్సన్ ఆస్కార్ అవార్డు విన్నర్ కావడం విశేషం. ఆయన యాక్టింగ్ చూస్తే అదరగొట్టాడు అనాల్సిందే. స్టోరీ లైన్ ఏంటంటే బంధాలు, బంధుత్వాలు తగ్గిపోవడం వల్ల జీవితంలో ఏం కోల్పోతామో అనే విషయాన్ని ఇందులో చూపించారు. కాకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ వేలో చూపించారు.

Watch One Hour Photo | Disney+

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఇందులో హీరో 20 ఏళ్లుగా ఫోటో డెవలపర్ గా పని చేస్తాడు. పనిపై అతనికి ఎంత ప్యాషన్ అంటే కనీసం అతనికి ఫ్రెండ్స్ ఉండరు. ఇల్లు, ఆ ఫోటోలను డెవలప్ చేసే డార్క్ రూమ్ తప్ప అతనికి బయట ప్రపంచం తెలియదు. ఇలాంటి వ్యక్తికి ఒక కుటుంబాన్ని చూశాక ఫ్యామిలీ కావాలని ఆశ పుడుతుంది. అది మంచిదే కానీ ఆ కుటుంబంలో తాను కూడా భాగమైతే బాగుండునని అనుకుంటాడు. వాళ్ల గురించి పేరు, ఊరు, ఆస్తితో సహా ప్రతి చిన్న విషయాన్ని, ఆ ఫ్యామిలీ వివరాలను తెలుసుకుంటాడు. ఇక అన్నీ తెలుసుకున్న ఈ హీరో ఆ ఫ్యామిలీ జీవితంలోకి బలవంతంగా వెళ్లి వాళ్ళ పరిస్థితిని ఘోరంగా మార్చేస్తాడు.

అసలు అతను ఎవరు? ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నాడు? వాళ్ల నుంచి ఇతనికి ఏం కావాలి? మరి అతను అనుకున్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీలో భాగం అయ్యాడా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఓ లుక్కెయ్యండి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఈ వీకెండ్ ట్రై చేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు