OTT Movie : అందాలను వలగా వేసి ఆ పని కానిచ్చే అమ్మాయి… లవ్ లో ఫెయిల్ అయిన మగాళ్ళు మస్ట్ వాచ్

OTT Movie : ప్రేమ అనే పదానికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కో నిర్వచనం ఉంటుంది. నిజానికి ఆ అద్భుతమైన ఫీలింగ్ అనిర్వచనీయం, అద్భుతమైన ఆనందాన్ని పంచే అనుభూతి అని చెబుతూ ఉంటారు. సినిమాల్లో కూడా మనం ఇదే చూస్తాము. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాత్రం లవ్ లో ఫెయిల్ అయిన మగాళ్లు అస్సలు మిస్ అవ్వకూడని సినిమా. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ హాలీవుడ్ కు సంబంధించింది కాగా, ఇందులో పాపులర్ హీరోయిన్ ఏంజలీనా జోలి ప్రధాన పాత్రను పోషించింది. ఈ మూవీ పేరు ఒరిజినల్ సిన్. సినిమా అంతా పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది. ముందుగా మూవీ హీరో హీరోయిన్ల మధ్య గాడమైన లవ్ స్టోరీతో మొదలై, కట్ చేస్తే రివెంజ్ గా మారుతుంది. ఇక ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కానీ మనకు మాత్రం చూసే అవకాశం లేదు. అయితే కొన్ని వెబ్ సైట్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. కానీ ఈ సినిమా లవ్ స్టోరీనే అయినప్పటికీ అందులో బోల్డ్ సీన్స్ ఘాటు కాస్త ఎక్కువగానే ఉంది. కాబట్టి సోలో వాచింగ్ సో బెటర్ అని గుర్తు పెట్టుకోండి.

Original Sin (2001) American Movie | Angelina Jolie | Antonio Banderas,Thomas | Fact & Some Details - YouTube

- Advertisement -

కథలోకి వెళ్తే…

ముందుగా ఓ రిచ్ ఫ్యామిలీని చూపిస్తారు. ఆ ఫ్యామిలీ వారాసుడే హీరో. ఈ క్రమంలో హీరోయిన్ హీరోపై మనసు పారేసుకుంటుంది. అతనికి కూడా ఆమె అంటే ఇష్టమే కావడంతో త్వరగానే దగ్గరవుతాడు. ఇక అతను అడగడమే ఆలస్యం అన్నట్టుగా అడ్డు అదుపు లేకుండా అన్ని ఇచ్చేస్తుంది. అలాగే తనకి ఏం కావాలో అతని దగ్గర నుంచి ఏదో ఒక విధంగా తీసుకునేది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. ఇక ఈ గాడమైన ప్రేమ మొదలవడంతో హీరో పూర్తిగా ఆమె కంట్రోల్ లోకి వెళ్లిపోతాడు. తన ప్రపంచమంతా హీరోయినే అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. ఏది పట్టించుకోకుండా హీరోయిన్ చుట్టూనే తిరుగుతాడు. ఇక హీరోయిన్ కు ఓ పెద్ద కొంపను చూపించి నువ్వే ఇక్కడ రాణివి. ఇదంతా నీదే అంటూ తన రాజకోట వంటి ఇంటి బాధ్యతలు అప్పజెబుతాడు. ఇంకేముంది ఆరామ్ గా వచ్చినపడిన ఆస్తిని అనుభవిస్తుంది హీరోయిన్.

కానీ ఇప్పుడు వస్తుంది అసలు ట్విస్ట్. నిజానికి ఆ అమ్మాయి తన అందాన్ని వలగా విసిరి అతని దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకుంటుంది. ఇక హీరోకి అసలు విషయం తెలిసి మైండ్ బ్లాక్ అవుతుంది. దీంతో ప్రాణంగా ప్రేమించిన ఆ అమ్మాయి పైనే రివెంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. మరి రివేంజ్ తీసుకోవడానికి హీరో ఏం చేశాడు? హీరోయిన్ ఎందుకు ఇలాంటి పని చేసింది ? అనే ఇంట్రస్టింగ్ విషయం తెలియాలంటే ఒరిజినల్ సీన్ అనే ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు