OTT Movie : క్రేజీ స్పై థ్రిల్లర్… సీను సీనుకో ట్విస్ట్ తో నెక్స్ట్ లెవెల్ మూవీ

OTT Movie : ఓటిటిలో ఎన్నో జానర్లకు సంబంధించిన సినిమాలు అందుబాటులో ఉండగా అందులో ఇంట్రెస్టింగ్ సినిమాల లిస్టులో తప్పకుండా  ఉంటాయి స్పై థ్రిల్లర్ సినిమాలు. ఇక ఈ జానర్ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఏ ఓటీటీలో స్పై థ్రిల్లర్ సినిమా ఉన్నా వెతికి మరీ ఆ సినిమాలను చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి ?అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ హాలీవుడ్ కు సంబంధించిన స్పై థ్రిల్లర్ మూవీ. హాలీవుడ్ అనగానే ఇప్పటివరకు టామ్ క్రూజ్ చేసిన మిషన్ ఇంపాజిబుల్ లాంటి హై రేంజ్ సినిమాలు కళ్ళ ముందు కదులుతాయి. కానీ ఈ మూవీ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ కంటే డ్రామానే ఎక్కువగా ఉంటుంది. కానీ పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే క్రేజీ సీన్స్ తో పిచ్చెక్కించారు అనిపిస్తుంది. స్టోరీ మొదలైనకొద్ది ఒక్కో క్యారెక్టర్ తో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ దిమ్మతిరిగేలా చేస్తుంది ఈ సినిమా. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

OUR KIND OF TRAITOR

- Advertisement -

స్టోరీలోకి వెళ్తే…

మూవీ స్టార్టింగ్ లో ఒక ప్రొఫెసర్ ని చూపిస్తారు. మరోవైపు సినిమాలో ఒక రష్యన్ మాఫియా కు సంబంధించిన లీడర్ ఉంటాడు. సినిమాలో వీరిద్దరివే ప్రధాన పాత్రలు. అయితే ఈ ప్రొఫెసర్ నిజానికి ఒక స్పై. అతనితో రష్యన్ లీడర్ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. అతను ఒక మాఫియా అన్న విషయం తెలిసి కూడా కావాలని స్నేహం పెంచుకుంటాడు. అక్కడితో ఆగకుండా పార్టీ పేరుతో అతన్ని పిలిచి ఒక డేంజరస్ ఇన్ఫర్మేషన్ ను షేర్ చేస్తాడు. దీంతో ప్రొఫెసర్ కు అసలేం అర్థం కాదు. నిజానికి మాఫియాకు సంబంధించి ఇది ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్. రష్యన్ మాఫియా తరుపున నా బహుమతి అంటూ అతను ఏకంగా మనీలాండరింగ్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రొఫెసర్ కి ఇస్తాడు. ఇంకేముంది ఆ తర్వాత ప్రొఫెసర్ అదే ఇన్ఫర్మేషన్ తమ ఏజెంట్స్ కి షేర్ చేస్తాడు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. అలా ఎందుకు తీసుకున్నావు అంటూ ఏజెంట్స్ హీరో పైనే అనుమాన పడతారు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది స్టోరీ పరుగులు పెట్టడం. నిజానికి రష్యన్ మాఫియాకు సంబంధించిన లీడర్ కి ప్రపంచంలోనీ ఇతర లీడర్ల వల్ల ప్రాణాపాయం ఉండడంతో దాన్నుంచి తప్పించుకోవడానికి ఇలా సమాచారాన్ని షేర్ చేస్తాడు. మరి ఇంతకీ ఈ రష్యన్ మాఫియా లీడర్ ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాడు? అతను ప్రొఫెసర్ కి ఎందుకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు? చివరికి వీళ్ళిద్దరూ అన్ని ప్రమాదాలు దాటుకుని బయటపడగలిగారా అనే విషయం తెలియాలంటే అవర్ కైండ్ ఆఫ్ ట్రైటర్ అనే సినిమాను చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు