OTT Movie : పిల్లకి పెళ్లి చేయాల్సిన వయసులో ప్రేమలో పడిన తల్లి… కూతురు ఏం చేసిందంటే?

OTT Movie : సాధారణంగా ఒక ఏజ్ దాటాక ప్రేమ, పెళ్లి అంటే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ముఖ్యంగా మన ఇండియాలో చాలా మంది ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటారు. కానీ పెళ్లీడుకు వచ్చిన పిల్లకు పెళ్లి చేయడం పక్కన పెట్టి తల్లి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కదా. కానీ చూస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ పేరేంటి అనే వివరాల్లోకి వెళితే…

ఆహాలో స్ట్రీమింగ్

మాలీవుడ్ ఇండస్ట్రీ అద్భుతమైన కంటెంట్ కు పెట్టింది పేరు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రియాల్టీ కి దగ్గరగా ఉండే సినిమాలతో అక్కడి మేకర్స్ అందరినీ అబ్బుర పరుస్తూ ఉంటారు. ఇప్పటికే మలయాళంలో రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణను దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా మలయాళ సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు మూవీ లవర్స్. ప్రస్తుతం మన మాట్లాడుకుంటున్న మూవీ పేరు పరిణయం. అనూప్ సత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వేఫారెర్ ఫిలిమ్స్, ఎంస్టార్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. 2020లో మలయాళం లో వరుని అవశ్యముందు అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇందులో దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్, శోభన, సురేష్ గోపి ప్రధాన పాత్రలో నటించారు. పరిణయం మూవీ తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రిమింగ్ అవుతోంది.

parinayam telugu movie watch online, SAVE 41% - www.latcomm.net

- Advertisement -

ఈ మూవీ స్టోరీ ఏంటంటే…

మీనా ఒక ట్యూషన్ టీచర్ గా పని చేస్తుంది. ఆమెకు పెళ్లీడుకొచ్చిన కూతురు నికిత ఉంటుంది. తల్లి కూతుర్లు ఇద్దరూ స్నేహితుల క్లోజ్ గా ఉంటారు. అయితే నీనా అంతకుముందే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని, మనస్పర్ధలు కారణంగా విడిపోతుంది. ఆ తర్వాత కూతురితో సింగిల్ మదర్ గా జీవిస్తుంది. తనలాగే తన కూతురు జీవితం కూడా నాశనం కాకూడదంటూ కూతురిని లవ్ జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా పెంచుతుంది. ముఖ్యంగా తన కూతురికి అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు నిఖిత, అభి అనే అబ్బాయితో ప్రేమలో పడుతుంది.

ఇంకోవైపు ఈ తల్లి కూతుర్లు ఉండే అపార్ట్మెంట్లో ఉన్న రిటైర్డ్ మేజర్ కృష్ణన్, నీనాకు మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ విషయం కూతురికి తప్ప ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్లందరికీ తెలుస్తోంది. దీంతో కూతురు తన తల్లిని ప్రశ్నిస్తుంది. ఈ విషయాన్ని బాయ్ ఫ్రెండ్ తో చెప్పగానే అతను నికితతో మాట్లాడడం మానేస్తాడు. అదే అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయితో బ్రేకప్ అయిన బిబిష్ దిగుతాడు. అటువైపు మేజర్ తో తల్లి ప్రేమాయణం సాగిస్తుంటే, ఇటువైపు నికిత బిబిష్ తో క్లోజ్ అవుతూ ఉంటుంది. మరి చివరికి ఈ తల్లి కూతుర్ల ప్రేమ వ్యవహారాలు ఎక్కడికి దారి తీసాయి? కూతురు చివరికి ఏం చేసింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే సున్నితమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ మూవీపై లుక్కేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు