OTT Movie : పిచ్చెక్కించే ఏలియన్ కామెడీ మూవీ… ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

OTT Movie : ఇప్పటిదాకా మనం ఎన్నో ఏలియన్స్ సినిమాలు చూసాము. అప్పుడెప్పుడో క్రిష్ మూవీ నుంచి మొదలుపెడితే రీసెంట్ గా కోలీవుడ్ లో అయాలాన్ అనే మూవీ దాకా అన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటి కోవకు చెందిందే. ఈ పిచ్చెక్కించే ఏలియన్ కామెడీ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? ఇప్పటిదాకా మనం చూసిన సినిమాలతో పోలిస్తే ఇది ఏ రకంగా డిఫరెంట్ గా ఉంటుందో చూద్దాం పదండి.

జియో సినిమాలో స్ట్రీమింగ్

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇప్పటిదాకా ఎన్నో ఏలియన్ సినిమాలు తెరపైకి వచ్చాయి. కానీ సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే పెట్టింది పేరు మాత్రం హాలీవుడే. నిజానికి ఏలియన్ సినిమాలు అంటే ఎక్కువగా యాక్షన్ జానర్ లోనే వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ మాత్రం కడుపుబ్బా నవ్వుకోగలిగే కామెడీతో ఉంటుంది. మరి ఈ ఎండ్ టు ఎండ్ కామెడీ ఎంటర్టైనర్ పేరేంటి అంటే పాల్. చాలా మంది ఈ హాలీవుడ్ మూవీని ఇంకా చూసి ఉండరు. ఏలియన్ సినిమాలను క్రేజీగా ఇష్టపడే వారికి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది.

Paul - JoBlo

- Advertisement -

కథలోకి వెళ్తే…

సినిమాలో ఓ ప్రాంతంలో ఏలియన్స్ తిరుగుతాయని కథలు కథలుగా చెప్పుకుంటారు జనాలు. కొంత మంది ఇలాంటివి పెద్దగా నమ్మకపోయినా మరికొంత మంది మాత్రం అక్కడికి ఏలియన్స్ వస్తాయి అని గట్టిగా నమ్ముతారు. ఈ క్రమంలోనే ఇద్దరు స్నేహితులు ఆ ప్రాంతంలో ఉండే ఏలియన్స్ ని చూడాలని క్యూరియాసిటీతో అక్కడకు వెళ్తారు. కానీ నిజానికి ఏలియన్స్ అనేవి ఉండవు అని వీళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతారు. కానీ అక్కడికి వెళ్లాక ఊహించని విధంగా ఈ ఫ్రెండ్స్ కి ఏలియన్ నిజంగానే అడ్డొస్తుంది.చూడడానికి అది గ్రీన్ కలర్ లో పెద్ద తలకాయతో కనిపిస్తుంది. ఇంకాస్త గమనిస్తే చేతులు కూడా ఉంటాయి. కానీ వాటికి మనలాగా 5 వేళ్ళు  కాకుండా 4 వేళ్ళు మాత్రమే ఉంటాయి. నిజానికి దాన్ని కళ్ళారా చూసాక కూడా వాళ్ళు నమ్మరు.

ఆ తర్వాత నెమ్మదిగా దాంతో సావాసం మొదలు పెట్టి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ ఏలియన్ పేరు పాల్ అని తెలుసుకుంటారు. అయితే ఈ ఏలియన్ ని పట్టుకోవడానికి మరోవైపు సీక్రెట్ సర్వీసెస్, ఏలియన్ హంటర్స్ కూడా తిరుగుతూ ఉంటారు. దీంతో ఈ ఇద్దరు స్నేహితులు పాల్ ని ప్రాణాలతో కాపాడి దాని నివాసానికి పంపాలనుకుంటారు. ఈ క్రమంలో పలు కామెడీ సన్నివేశాలు ఉండగా, చివరికి ఛేజింగ్ సీక్వెన్స్ లో ఆ ఇద్దరు స్నేహితుల ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటారు. మరి పాల్ ని అనుకున్నట్టుగానే కాపాడగలిగారా ? ఈ క్రమంలో ఆ ఇద్దరు స్నేహితులు సేఫ్ గా బయటపడ్డారా ? అనే విషయాలు తెలియాలంటే జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ పాల్ మూవీపై ఓ లుక్ వేయాల్సిందే. ఈ సినిమాను చూసినంత సేపు హ్యాపీగా నవ్వుకుంటారు. కాబట్టి ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు