OTT Movie : దెయ్యం కొడుకు అని తెలియక ప్రేమ, ప్రెగ్నెన్సీ… చుట్టూ తిరిగే వింత ఆకారాన్ని చూసి ఆ అమ్మాయి…

OTT Movie : ప్రస్తుతం హారర్ సినిమాలకు మరింతగా క్రేజ్ పెరిగింది. ఓటిటిల్లోకి వచ్చే ప్రతి భయంకరమైన మూవీపై ఓ లుక్కేయాలని డిసైడ్ అయిపోయారు ఓటీటీ లవర్స్. అందుకే ఏ ఓటీటీలో ఎలాంటి హారర్ మూవీ ఉన్నా టైం చూసుకుని మరీ ఆ సినిమాలను చూసేస్తున్నారు. అందులో ఉండే హారర్, సస్పెన్స్ అంశాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఓటిటీలోకి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న హారర్ వెబ్ సిరీస్ పెట్టబోతోంది. మరికొన్ని గంటల్లోనే ఈ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. దయ్యంతో రిలేషన్, ప్రేమ, ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఈ సిరీస్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ ని ఓ ఊపు ఊపేసింది. మరి ఇంతకీ ఈ సిరీస్ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ ఇప్పటిదాకా చూడని విచిత్రమైన కంటెంట్ తో తెరకెక్కింది. సాధారణంగా హారర్ మూవీలు అనగానే ప్రతీకారం కోసం రగిలిపోయే ఆత్మలు, బ్రతికున్న మనుషులను బలి తీసుకోవాలని తహతహలాడే ప్రేతాత్మలు, ఇంకొకరి శరీరాన్ని ఆవహించడం, అందులో నుంచి వాటిని తరిమి కొట్టడం వంటి స్టోరీలన్నీ మనం ఇప్పటిదాకా చూసేసాం. కానీ ఈ సిరీస్ లో మాత్రం ఇవన్నీ కాకుండా డిఫరెంట్ గా చూపించారు. ఓ యువతి దెయ్యంతో ప్రేమలో పడి, ఏకంగా ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు పాలైన్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ మే 22 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ మే 21 అర్ధరాత్రి నుంచి హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇక పాలైన్ స్టోరీ లోకి వెళ్తే…

వన్ డే స్టాండ్ రిలేషన్ లో భాగంగా యువతి ఓ యువకుడితో రాత్రి మొత్తం గడుపుతుంది. అయితే ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఇదే విషయాన్ని ఆరోజు రాత్రి గడిపిన యువకుడికి చెప్తుంది. కానీ అసలు విషయం ఏమిటంటే ఆ కుర్రాడు సాధారణంగా ఉండే మామూలు మనిషి కాదు. వాడొక ప్రేతాత్మకు కొడుకు. ఆమె కేవలం ప్రేతాత్మ కాదు క్రూరమైన పవర్ ఫుల్ డెవిల్ అని చెప్పొచ్చు.

- Advertisement -

అలాంటి ఒక డెవిల్ కొడుకుతో రాత్రంతా గడిపి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటుంది యువతి. అయితే ఈ విషయాన్ని చెప్పగానే అతను కంగారు పడిపోయి ఎలాగైనా సరే అబార్షన్ చేయించాలని అనుకుంటాడు. ఎందుకంటే ఈ విషయం తన తల్లికి తెలిస్తే ఆ అమ్మాయితో పాటు తనను కూడా బ్రతకనివ్వదు అని భయపడుతూ ఉంటాడు. మరోవైపు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి తన చుట్టూ ఏదో వింత ఆకారం తిరుగుతూ ఉండడన్ని గమనిస్తుంది. చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా కొన్ని వస్తువులు గాల్లోకి లేవడం వంటి గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. మరి ఆ అబ్బాయి డెవిల్ తల్లి నుంచి ఆమెను ఎలా కాపాడతాడు? యువతి అబార్షన్ చేయించుకుంటుందా? అనే విషయాలు తెలియాలంటే పాలైన్ అనే సిరీస్ ను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు