OTT Movie : ఉత్తరాలతో హీరోను వెంటాడే ఆడ దెయ్యం… ఓటిటిని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్

OTT Movie : ఇప్పటిదాకా మనం ఎన్నో దయ్యాల స్టోరీల గురించి విన్నాము చూసాము. కానీ ఉత్తరాలు రాసే దయ్యం గురించి మాత్రం చూడలేదు. చాలా దయ్యం స్టోరీలు ఏదో ఒక బంగ్లాను టార్గెట్ చేసుకునే ఉంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా.. కాకపోతే హీరోకి దయ్యం ఉత్తరాల రూపంలో భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నింటిని తెలియజేస్తుంది. ఈ లైన్ వినగానే నాగ చైతన్య ధూత సిరీస్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. మరి ఈ వింత దయ్యం స్టోరీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

కొత్త కొత్త హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ సజెషన్. రొటీన్ హారర్ సినిమాలను చూసి బోర్ గా ఫీల్ అయితే తప్పకుండా ఈ వీకెండ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పై ఓ లుక్కెయ్యండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ పేరు ఫోనిక్స్. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Phoenix: First look of the Anoop Menon, Aju Varghese film heralds a horror  mystery

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఇందులో హీరో కొత్త ఇంటికి మారాలనే ఉద్దేశంతో ప్రశాంతంగా, జనాలు ఎవ్వరూ లేని చోట్లో ఉండే ఇంటి కోసం వెతుకుతాడు. బీచ్ కు దగ్గరలో ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా మంచి ఇల్లు దొరుకుతుంది. చూడగానే ఆ ఇల్లు నచ్చడంతో వెంటనే తన భార్య పిల్లలతో దిగిపోతాడు. కానీ ఆ ఇంట్లో సాధారణంగా ఉండాల్సిన కరెంట్, ఫోన్ లేదా టెలిఫోన్ లాంటి ఎమినిటీస్ ఏమీ ఉండవు. పైగా ఇంట్లోకి దిగినప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తానికి కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలోనే ఒకరోజు ఆ ఇంటికి ఉత్తరం వస్తుంది. కానీ హీరో అంతకుముందు చూసి చూడనట్టుగా వదిలేస్తాడు. అయితే ఫ్రెడ్డి  అనే పేరుతో వరుసగా ఆ ఇంటికి ఉత్తరాలు వస్తాయి. దీంతో ఎవరు ఎవరికి రాస్తున్నారా అని హీరో ఆ ఉత్తరాన్ని చూస్తాడు. అలాగే పోస్ట్ మాన్ ని కూడా అడుగుతాడు. కానీ అతనేమో మీ ఇంటికి ఎలాంటి ఉత్తరాలు తీసుకురాలేదని చెప్తాడు. ఈ సస్పెన్స్ ని కంటిన్యూ చేస్తూ హీరో ఉత్తరాలను తీసి చదవడం స్టార్ట్ చేస్తాడు. అవన్నీ చదివాక హీరోకి ఓ ప్రేమికురాలు తన ప్రియుడి కోసమే ఈ ఉత్తరాలు రాస్తున్నట్టుగా అనిపిస్తుంది. అతను ఉత్తరాల్లో చదివే సంఘటనలన్నీ ఆ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. దీంతో అనుమానం, భయం పెరిగి అసలు ఆ లేఖలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు రాస్తున్నారు తెలుసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ వర్కౌట్ కాకపోవడంతో వదిలేసి మరో ఇంటికి వెళ్తారు. అక్కడకు కూడా వాళ్లను వదలకుండా ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. ఇంతకీ ఆ ఉత్తరాలు ఎవరు రాస్తున్నట్టు? ఎందుకు ఈ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు? ఉత్తరాల వెనుక ఉన్న కథ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఫోనిక్స్ మూవీ పై ఓ లుక్ వెయ్యండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు