OTT Movie : ఆ అమ్మాయి కంట్లోంచి నీళ్లు వస్తే కుక్క చావే… ఇంకోసారి అమ్మాయిలను ఏడిపించాలంటే వణుకు పుట్టించే మూవీ

OTT Movie : వీకెండ్ వస్తే చాలు ఓటిటిలో ఏ సినిమాలు ఉన్నాయా అంటూ ఓ లుక్కెయ్యడం అలవాటైపోయింది మూవీ లవర్స్ కి. ఇక ప్రస్తుతం మన ఈ మూవీ సజెషన్ సస్పెన్స్ మూవీ లవర్స్ కోసమే. అందులో ఆ అమ్మాయి కంట్లోంచి నీళ్లు వస్తే ఏడిపించిన వాళ్ళు కుక్క చావు చావాల్సిందే. అలాగే ఈ సినిమా చూశాక ఎవరైనా అమ్మాయిని ఏడిపించాలి అంటే వణికిపోవడం ఖాయం. మరి ఇంతకీ ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమంగ్ అవుతుందో ఓ లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

సాధారణంగా తిట్టడం, ఎవరినైనా సరదాగా ఏడిపించడం అనేది చాలామందికి ఉండే బ్యాడ్ హ్యాబిట్. కొన్నిసార్లు అది హద్దులు దాటి అవతలి వాళ్ళు బాధపడుతుంటే చూసి శునకానందం పొందుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని చూస్తే అక్కడే పీక పిసికి చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. మరి ఇలా అనుకున్నంత పని చేసేస్తే ఏం జరుగుతుంది? ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు పిగ్గీ. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Watch Piggy Movie Online | Buy Rent Piggy On BMS Stream

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే…

స్పెయిన్ లోని ఒక చిన్న ఊర్లో తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తుంది ఓ టీనేజ్ అమ్మాయి సారా. తనకు ఇల్లు, స్కూల్ తప్ప ఇంకేమీ తెలియదు. ఎక్కువగా పేరెంట్స్ తోనే గడుపుతూ ఉంటుంది. అయితే టీనేజ్ లో ఉన్న ప్రతి అమ్మాయికి ఫ్రెండ్స్ తో గడపాలని ఉంటుంది. అలాగే ఈ అమ్మాయికి కూడా తన ఫ్రెండ్స్ తో సరదాగా గడపాలి అని ఆశగా ఉంటుంది. కానీ అమ్మాయి లావుగా ఉండడంతో ఫ్రెండ్సే పంది పిల్ల అని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆమెను పొరపాటున కూడా తమ దగ్గరకు రానివ్వరు. ఈ క్రమంలోనే ఓ రోజు మధ్యాహ్నం పూట టీనేజ్ పాప స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టాలని అనుకుంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు స్నేహితులు సారాను టీజ్ చేయడంతో పాటు ఆమె బట్టలు కూడా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీంతో అవమానంతో సారా చేసేదేం లేక తన ఒంటి మీద ఉన్న స్విమ్మింగ్ డ్రెస్ తోనే రోడ్లపై ఇంటికి పరిగెడుతుంది. అప్పుడు కూడా వాళ్ళు వదలకుండా కార్లో వెళుతూ సారాను దారుణంగా ఏడిపిస్తారు. కానీ సడన్ గా ఆ రోడ్లో వెళ్తున్న ఓ సైకో కిల్లర్ వ్యాన్ నుంచి టవల్ కిందపడుతుంది.సారా ఆ టవల్ కప్పుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే తర్వాత రోజే సారా ను ఏడిపించిన ముగ్గురు అమ్మాయిలు కూడా కిడ్నాప్ అయ్యారని వార్త బయటకు వస్తుంది. దీంతో సారా వాళ్ళ అమ్మతో సహా పోలీసులు కూడా అసలు ఏం జరిగిందని ఆమెను ప్రశ్నిస్తారు. మరి ఆ సైకో కిల్లర్ సారను ఎందుకు కాపాడాడు? సైకో కిల్లర్ కు సారాపు ఉన్న సంబంధం ఏంటి? అతడు సారాను ఏడిపించిన వాళ్ళను ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే పిగ్గీ మూవీని వీక్షించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు