OTT Movie : సీన్ సీన్ కీ సుస్సు పడే హారర్ మూవీ… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie : హారర్ కంటెంట్ కు ఉండే క్రేజ్ అంతా ఇంకా కాదు. ఓటిటిలో లేదా థియేటర్లలో హారర్ సినిమాలను చూసి థ్రిల్ అవ్వడానికి మూవీ లవర్స్ బాగా ఆసక్తిని కనబరుస్తారు. అందులో ఉండే భయంకరమైన సన్నివేశాలు, ట్విస్టులు ఇలా దెయ్యం సినిమాలకు కనెక్ట్ కావడానికి కారణం అవుతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ మూవీని తీసిన ఆరుగురు నటీనటులు సినిమా రిలీజ్ కాకముందే చనిపోవడం గమనార్హం. అంతేకాకుండా ఈ సినిమాను తీస్తున్న సమయంలో దర్శక నిర్మాతలకు వింత సంఘటనలు ఎదురయ్యాయట. ఇప్పటికీ ఈ మూవీ గురించి కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈ భయంకరమైన మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటిటిలలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సాధారణంగా హారర్ సినిమాలు తీసేటప్పుడు కొన్నిసార్లు భయంకరమైన రియల్ సిచువేషన్స్ ఫేస్ చేశామని దర్శక నిర్మాతలు చెబుతూ ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం నిజంగానే అత్యంత భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ హారర్ మూవీ పేరు ఫోల్టర్ గైస్ట్. 1982లో రిలీజ్ అయిన ఈ మూవీ అత్యంత భయంకరమైన హాలీవుడ్ సినిమాల లిస్టులో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది.

The Crazy Story Behind the Real Skeletons That Were Used in POLTERGEIST —  GeekTyrant

- Advertisement -

సినిమా తీస్తున్నప్పుడు వరుస చావులు…

ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఓ ఫ్యామిలీ నివసిస్తున్న ఇంటిపై దయ్యాలు దాడి చేస్తాయి. ఆ తర్వాత వాళ్ళ కూతుర్ని ఎత్తుకెళ్లిపోతాయి. ఈ మూవీకి టోబి హుపర్ దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ సినిమాలో షూటింగ్ కోసం ప్రత్యేకంగా అస్తిపంజరాలను తయారు చేయకుండా నిజమైనవే వాడారని టాక్. ఇక ఫోల్డర్ గయిస్ట్ మూవీని రూపొందిస్తున్న సమయంలో మొదలైన చావులు రిలీజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యాయి. ముందుగా ఈ సినిమాలో పెద్ద కూతురుగా నటించిన డొమెనిక్ డోన్ అనే అమ్మాయిని ఆమె బాయ్ ఫ్రెండ్ 1982లో చంపేశాడు. ఆ తర్వాత చిన్న కూతురుగా నటించిన హీథర్ ఓరూర్ కి అనే అమ్మాయి గుండెపోటుతో 12 ఏళ్ల వయసులోనే కన్ను మూసింది. ఈ రెండు ఈ యాదృచ్ఛికమే అనుకున్నప్పటికీ ఆ తర్వాత మరో వ్యక్తి 2009లో హత్యకు గురయ్యాడు. ఇదే వరుసలో ఈ సినిమాలో మాంత్రిడిగా నటించిన జూలియన్ క్యాన్సర్ తో 1987లో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇలా మొత్తంగా మూవీ మొదలై రిలీజ్ అయ్యాక కూడా వరుసగా ఆ సినిమాకు సంబంధించిన నటీనటులు మరణించడం సినిమా చరిత్రలో అదే మొదటి, చివరి ఘటన అయ్యి ఉండొచ్చు. ఇలాంటి భయంకరమైన మూవీని ఒంటరిగా చూడాలంటే ఎంతో ధైర్యం ఉండాల్సిందే. ఒకవేళ ఈ మూవీని ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు