OTT Movie : తనకు మాత్రమే కనిపించే వింత ఆకారంతో అమ్మాయి ఒంటరి పోరాటం… సస్పెన్స్ అంటే ఇదీ

OTT Movie : హాలీవుడ్ యాక్షన్ సినిమాలు అనగానే పడి చచ్చేవాళ్ళు ఇండియాలో ఎంతో మంది ఉన్నారు. హాలీవుడ్ నుంచి యాక్షన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ముందుగానే థియేటర్లలో చూడడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక అవెంజర్స్ సినిమాలకు ఇక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది అంటేనే అసలు హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది. ఇక ఇలా హాలీవుడ్ యాక్షన్ సినిమాలను ప్రత్యేకంగా ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. తనకు మాత్రమే కనిపించే ఓ వింత ఆకారంతో అమ్మాయి ఒంటరి పోరాటం చేస్తుంది. ఈ సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చు? ఆ మూవీ పేరేంటి? అని విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మూవీ 2022 లోనే రిలీజ్ అయింది. థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ ప్రస్తుతం రెండు భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు ప్రే. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండడం గమనార్హం. భాషతో పెద్దగా ఇబ్బంది లేదు అనుకునే ప్రేక్షకులు తప్పకుండా ఓసారి ఈ మూవీని చూడొచ్చు.

Prey 4K Blu-Ray Review - Alien vs. Predator Galaxy

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

1987లో రిలీజ్ అయిన ప్రిడేటర్ మూవీ హాలీవుడ్ మూవీ లవర్స్ కి కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిందే ప్రే. ఇందులోను ఫస్ట్ పార్ట్ లాగే స్టోరీ ఉంటుంది. ప్రిడేటర్ మూవీలో లెఫ్టినెంట్ జనరల్ ఆర్నాల్డ్ ఒక్కడే అడవిలోకి వెళ్లి ఏలియన్ ని చంపేస్తాడు. ఆ సినిమాలో ఆయన యాక్షన్ చూస్తే పిచ్చెక్కి పోవడం ఖాయం. ఇక ఇప్పుడు ప్రే విషయంలో కూడా ఇలాంటి స్టోరీనే ఉంటుంది. కాకపోతే ఈసారి హీరోయిన్ యాక్షన్ చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు.

కథలోకి వెళ్తే ఏలియన్ ఒక అడవిలో దిగుతుంది. అయితే అడవిలో ఉండే తెగకు సంబంధించిన అమ్మాయి ఈ విషయాన్ని కనిపెడుతుంది. కానీ ఎవరికైనా చెబుదామంటే అది ఈ అమ్మాయికి మాత్రమే కనిపిస్తుంది. మొదట్లో ఆమె మాటను ఎవరూ పట్టించుకోరు.  రాను రాను పరిస్థితులను అర్థం చేసుకొని ఆమెకు సహకరిస్తారు. అందరినీ కాపాడాలని అనుకునే ఆ అమ్మాయి ఏలియన్ కు ఎలాంటి ఎర వేసింది? ఏలియన్ తో ఒక్కతే పోరాడి గెలిచిందా ? చివరికి ఏలియన్ ని చంపేసిందా? అసలు ఆ ఏలియన్ వల్ల వీళ్ళకు వచ్చిన సమస్య ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ప్రే మూవీని చూసి తీరాల్సిందే. ఒకవేళ ఇప్పటిదాకా ఈ మూవీని కనుక చూసి ఉండకపోతే కచ్చితంగా ఓసారి చూసేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు