OTT Movie : లవర్ ప్రైవేట్ వీడియో లీక్… ఓటీటిలోకి వచ్చేసిన లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : మూవీ లవర్స్ ఎక్కువగా మెచ్చే సినిమాలలో ప్రేమ కథా చిత్రాలు కూడా ఉంటాయి. అయితే వీటిలో హ్యాపీ ఎండింగ్ ఉంటేనే చాలా మంది ఇష్టపడతారు. కానీ సాడ్ ఎండింగ్ ఉండే కొన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు అని చెప్పొచ్చు. తెలుగులో ఇలాంటి సినిమాలకు పెద్దగా ప్రేక్షకాదరణ దక్కలేదు. కానీ తమిళంలో మాత్రం ఇలాంటి రా అండ్ ప్లాస్టిక్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది అక్కడి ప్రేక్షకుల నుంచి. ఈరోజు కూడా మనం చెప్పుకోబోయే మూవీ ఇలాంటిదే. మరి ఈ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమాలో లవ్ స్టోరీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా బాగుంటాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా పేరు ప్రేమలో. ఇప్పటిదాకా ఈ మూవీని చూడకపోతే ఈ వీకెండ్ ఓ లుక్కేయండి.

Amazon Prime Video - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on Amazon Prime Video | Sakshi

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

సినిమా ఓపెనింగ్ లోనే రాజు అనే వ్యక్తి ఆధార్ కార్డును చూపించి వెతుకుతాడు మరో వ్యక్తి. ఆ తర్వాత అతన్ని పట్టుకుని నీకు ఆ వీడియో ఎవరు పంపించారు అంటూ చిత్రహింసలు పెడతాడు. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో చూపిస్తారు. ప్రియా అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. అయితే ఆమెను చూడడానికి వచ్చిన ప్రియుడు రవికి హీరోయిన్ తండ్రి వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయినప్పుడు తీసిన వీడియోను చూపిస్తాడు. ఆ వీడియోని చూశాక హీరోయిన్ ఫాదర్ అతన్ని చంపేద్దామని డిసైడ్ అవుతాడు. దీంతో రవి వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. మరో సీన్ లో ఇంకో వ్యక్తి రాజుతో పాటు అతని ఫ్రెండ్ ని కూడా చంపేస్తాడు. అలా ఓవైపు ప్రెసెంట్ సిచువేషన్ చూపిస్తూనే గతంలో ఏం జరిగిందో కూడా సినిమాలో చూపిస్తాడు దర్శకుడు.

నెక్స్ట్ అసలు రవికి ప్రియకు మధ్య ఎలా పరిచయం జరిగింది అనే విషయాన్ని చూపిస్తాడు. మెడికల్ షాప్ లో పని చేసే రవికి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ప్రియాకి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ తన ప్రేమ విషయాన్ని ప్రియకు చెబుదాం అనుకున్న హీరోకి ఆ అమ్మాయి మూగది అనే విషయం తెలుస్తుంది. అయినప్పటికీ ఆమెనే ప్రేమిస్తాడు రవి. అయితే అంతలోనే ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో ప్రియకు వేరే పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. ఓ రోజు రాత్రి రవి, ప్రియ కలవాలని అనుకుంటారు. అదే టైంలో కొంత మంది ప్రియను రేప్ చేస్తారు. అసలు ఆమెను రేప్ చేసింది ఎవరు? హీరో హీరోయిన్ ప్రైవేట్ వీడియో ఎలా లీక్ అయింది? చివరకు ఈ స్టోరీ ఎలాంటి మలుపు తిరిగింది ? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు