OTT Movie : చనిపోయిన కూతురు తిరిగొస్తే ఇంత భయంకరంగా ఉంటుందా? వణికించే హార్రర్ మూవీ

OTT Movie : ఓటిటిలో లెక్కలేనని హారర్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే అందులో చాలా వరకు సినిమాలను చూసేసి ఉంటారు. అయితే ఎన్ని సినిమాలు చూసినా చూడడానికి రోజుకో కొత్త సినిమా పుట్టుకొస్తూనే ఉంది. హారర్ సినిమాలకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. పైగా ఇది కొరియన్ హారర్ డ్రామా కావడం విశేషం. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

Primbon (2023) – Review | Netflix Horror Movie | Heaven of Horror

స్టోరీ ఏంటంటే…

సినిమా మొదలపగానే హీరోయిన్ తన తల్లి బర్త్ డే కి సంబంధించిన ఏర్పాట్లలో తల మునకలై ఉంటుంది. ఓ స్పెషల్ వీడియోను రికార్డ్ చేయడమే కాకుండా తన తల్లికి గుర్తుండి పోయేలాగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే పక్కనే ఉన్న ఫారెస్ట్ కు వెళ్లి అక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. అంతేకాకుండా తనతో పాటు తన ఫ్రెండ్ జాన్ ను తీసుకుని అడవికి వెళుతుంది. అయితే ఆ తర్వాత రోజు జాన్ ఒక్కడే ఇంటికి తిరిగి వస్తాడు. కానీ హీరోయిన్ ఎక్కడా కనిపించదు. ఆమె తప్పిపోయిందేమో అనుకుని హీరోయిన్ తల్లిదండ్రులతో పాటు ఆ చుట్టు పక్కల వాళ్ళంతా అడవిని జల్లెడ పడతారు. అయితే ఎంత వెతికినా ఉపయోగం లేకపోవడంతో అందరూ తిరిగి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత ఏడు రోజులు పూర్తయ్యాక కూడా హీరోయిన్ తిరిగి రాకపోవడంతో ఫ్యామిలీ అంతా ఓ నిర్ణయానికి వస్తారు.

- Advertisement -

తమ ఇంట్లో ఉండే ఓ బుక్ ను ఆధారంగా చేసుకుని హీరోయిన్ చనిపోయిందని నమ్ముతారు. పైగా తమ ఆచారాల ప్రకారం ఆమె కర్మకాండలకు సంబంధించిన పనులు కూడా చేసేస్తారు. అయితే హీరోయిన్ తల్లి మాత్రం ఈ విషయాలను అస్సలు ఒప్పుకోదు. ఓ రోజు సడన్ గా హీరోయిన్ ఇంటికి తిరిగి వస్తుంది. అయితే ఆమె కుటుంబ సభ్యులలో ఒకరు మాత్రం తను తమ అమ్మాయి కాదని, దయ్యమని హీరోయిన్ తండ్రికి చెప్తుంది. కానీ ఆమె మాటలను ఇంట్లో ఉన్న ఒక్కరు కూడా పట్టించుకోరు. ఆమె తిరిగి రావడమే ఒక పెద్ద షాక్ అనుకుంటే హీరోయిన్ తిరిగి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ అందరిని భయపెడతాయి. అయితే హీరోయిన్ తల్లి మాత్రం ఎవరు ఎంత చెప్పినా ఆమె తన కూతురు కాదు అని నమ్మడానికి సిద్ధంగా ఉండదు. మరి ఇంతకీ అసలు హీరోయిన్ రూపంలో ఆ ఇంటికి వచ్చింది ఎవరు? ఆ ఫ్యామిలీలో మిగతా వాళ్ళు అనుకున్నట్టుగా ఆమె అడవిలో తప్పిపోయిన తమ అమ్మాయి కాదా? చివరికి ఈ స్టోరీ ఎలాంటి టర్న్ తిరిగింది? అనే విషయాలకు సమాధానం తెలియాలంటే ప్రింబాద్ అనే ఈ హర్రర్ సినిమాను చూడాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు