OTT Movie : పని వాడికి ఒళ్ళు అప్పగిస్తే… వెన్నులో వణుకు పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : సాధారణంగా ఎవరికైనా పని ఇచ్చేటప్పుడు వాళ్లు ఎలాంటి వాళ్ళు ? వాళ్ళ బ్యాగ్రౌండ్ ఏంటి ? అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే జరగరాని అనర్ధాలు ఎన్నో జరుగుతాయి. ఇలా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఓ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. పని వాడిపై మనసు పారేసుకుని ఒళ్ళు అప్పగిస్తే.. వాడు చేసే దారుణం చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటిలో స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ పేరేంటి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ ఓటీటీలో ఉందంటే?

పని వాడిని నమ్మిన ఒక అమ్మాయి జీవితం తలకిందులయ్యే ఈ మూవీ ప్రస్తుతం రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. లైన్స్ గేట్ అనే ఓటీటిలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ది ఫ్లిక్సర్ అనే వెబ్సైట్లో కూడా ఈ మూవీని చూడొచ్చు. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ ఇందులో కొన్ని బో*ల్డ్ సీన్స్ ఉన్నాయి అని విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

Ashley Benson IMDb, 58% OFF | codexperutrade.com

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఇందులో హీరోయిన్ చాలా రిచ్. ఆస్తులు అంతస్తులు అన్నీ ఉంటాయి కానీ ఆ సు*ఖమే ఉండదు. ఆమె భర్త ఎప్పుడూ వ్యాపార పనులతో బిజీ బిజీగా ఉంటాడు. కనీసం హీరోయిన్ ని పట్టించుకునే తీరిక కూడా అతనికి ఉండదు. మరోవైపు హీరోయిన్ భర్త తనతో కనీసం 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయడు, తనను అర్థం చేసుకోడు అని ఫీల్ అవుతుంది. ఇలాంటి టైంలో పనోడు దిగుతాడు. అతన్ని ముందు బాగా గమనిస్తుంది హీరోయిన్. నమ్మదగ్గ వాడే అని నిర్ణయానికి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇద్దరి మధ్య మాటలు కలుస్తాయి. కలుస్తాయి అనడం కన్నా ఆ పనివాడే కలిపేస్తాడు అని చెప్పొచ్చు. పరిస్థితిని అర్థం చేసుకున్నాక ఆమెకు అన్నీ ఉన్నా ఆ సుఖం మాత్రం లేదని అర్థం చేసుకుంటాడు. ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఆమెతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నాలు చేస్తాడు.

ఆ సాన్నిహిత్యం కాస్త శారీరక సంబంధానికి దారి తీస్తుంది. మొత్తానికి ఇద్దరూ ఒక్కటైన తర్వాత స్టోరీలో కీలక మలుపు చోటు చేసుకుంటుంది. ఆ పని వాడు తన ఫ్రెండ్ తో కలిసి ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తాడు. అయితే ఆ ఫ్రెండ్ మాత్రం ఆ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావు, ఆమెను కావాలనుకుంటున్నావు అంటూ ఇతనితో గొడవ పడతాడు. పనివాడు అసలు ఆ అమ్మాయి నాకు అవసరం లేదు అని చెప్తూనే ఆమెతో సన్నిహితంగా మెలుగుతాడు. అయితే నిజానికి వీరిద్దరూ కలిసి దొంగతనం చేయడంలో ఎక్స్పర్ట్స్. అవసరమైతే చంపే దాకా వెళ్లడానికి కూడా వెనకాడరు. మరి ఇలాంటి కరుడుగట్టిన దొంగల చేతికి చిక్కిన హీరోయిన్ చివరికి బ్రతికి బయటపడగలిగిందా? ఆ పనివాడు ఆ అమ్మాయిని నిజంగానే ఇష్టపడ్డాడా? చివరికి హీరోయిన్ కి వాడు దొంగ అని తెలిసిందా? అనే విషయాలు తెలియాలంటే ప్రైవేట్ ప్రాపర్టీ అని ఈ సినిమాను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు