OTT Movie : ఆ పార్ట్ కోసమే అమ్మాయిల హత్యలు… వీడెక్కడి సైకోరా బాబూ

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారందరికీ బాగా నచ్చే మూవీస్ లో సైకో కిల్లర్ అనే క్యాటగిరి తప్పకుండా ఉంటుంది. ఇక సైకో కిల్లర్ అనగానే ఎక్కువగా అమ్మాయిలను టార్గెట్ చేసే సినిమాలే గుర్తొస్తాయి. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అదే. కానీ ఆ ఒక్క పార్ట్ కోసమే ఈ సైకో కిల్లర్ అమ్మాయిలను హత్య చేయడం ఇక్కడ విశేషం. మరి ఈ ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ క్రైం థ్రిల్లర్ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో..

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ది కాల్. 2013 లో రిలీజ్ అయిన ఈ మూవీ పోలీసులకే చెమటలు పట్టిస్తుంది. ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక టైటిల్ ని చూసి ఏ పార్ట్ అని కొందరు, ఆ పార్టేనా అనే మరికొందరు ఎక్స్పెక్టేషన్స్ తో చదువుతూ ఉండొచ్చు. అయితే ఆ కొంతమంది అనుకుంటున్న పార్ట్ మాత్రం కాదు. మరి ఏ పార్ట్ గురించి ఈ సైకో కిల్లర్ అమ్మాయిలను చంపుతున్నాడో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

Prime Video: The Call

- Advertisement -

కథ ఏంటంటే?

విదేశాల్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వెంటనే 911 కి కాల్ చేస్తారని ఇప్పటికే మనం ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో చూసాము. ఈ మూవీలో ఆ 911 కాల్ సెంటర్లో పని చేస్తుంది హీరోయిన్ జోర్డాన్. ఒక అమ్మాయి భయపడుతూ ఎవరో డోర్ గట్టిగా కొడుతున్నారని ఫోన్ చేస్తుంది. జోర్డాన్ వెంటనే ఓ ప్లాన్ చెప్పి ఆమెను దాక్కోమంటుంది. అమ్మాయి అదే ఫాలో అయ్యి డోర్ పగలగొట్టి ఇంట్లోకి వచ్చిన సైకోకు మస్కా కొట్టి దాక్కుంటుంది. దీంతో ఆ సైకో కూడా అమ్మాయి పారిపోయిందనుకొని వెళ్ళిపోతాడు. కానీ అంతలోనే జోర్దార్ ఆ అమ్మాయికి సేఫ్ గా ఉందా లేదా అని ఫోన్ చేయడంతో, రింగ్ టోన్ విని అతను వెనక్కి తిరిగి వచ్చి ఆ పిల్లని చంపేస్తాడు. మళ్లీ ఇంకొక కేస్ వస్తుంది.

అందులో అమ్మాయిని డిక్కిలో పడేస్తాడు సైకో కిల్లర్. అయితే ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న చిన్న ఫోన్ తో 911కి కాల్ చేయడంతో ఆమె డిక్కీలో ఉన్న పెయింట్ బ్రష్ తో లైట్స్ పగలగొట్టేసి అందులో ఉన్న పెయింట్ ని కింద పారుపోయమని చెప్తుంది. కానీ అది గమనించి ఆ పిల్లకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ సైకో అత్యంత కిరాతకంగా చంపేస్తాడు. దీంతో జోర్డాన్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఈ వరుస హత్యలు చేస్తున్న ఆ సైకో కిల్లర్ అమ్మాయిల జుట్టు కోసమే ఈ పని చేస్తాడు. జుట్టుతో సహా చర్మాన్ని పీకేసి అతడు ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇలా జుట్టు కోసమే అమ్మాయిలని చంపుతున్నాడు? చివరికి ఆ కిడ్నాప్ అయిన అమ్మాయిని జోర్డాన్ కాపాడిందా? అని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ది కాల్ మూవీపై ఓ లుక్కెయ్యండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు