OTT Movie : కళ్ళ ముందే భార్య ఆత్మహత్య… మందు, మంచింగ్ తో ఎంజాయ్ చేసే ఇన్స్పెక్టర్ భర్త

OTT Movie : రివేంజ్ డ్రామా సినిమాలంటే ఇష్టమా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రైట్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ రివెంజ్ డ్రామాలో నటీనటుల యాక్టింగ్ హైలెట్ అని చెప్పొచ్చు. మరి ఈ ఆసక్తికర రివెంజ్ డ్రామా టైటిల్ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

అర్జున్ దాస్ హీరోగా, సుజిత్ శంకర్ విలన్ గా నటించిన తమిళ మూవీ రసవతి. శాంత కుమార్ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ చివరి వరకు ఈ సినిమా ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Rasavathi OTT release: When and where to watch this Arjun Das starrer Tamil  movie

- Advertisement -

కథలోకి వెళ్తే…

సినిమాలో ముందుగా విలన్ ను పరిచయం చేస్తారు. అతని పేరు పరశు. తన సీక్రెట్ తెలుసు అంటూ బ్లాక్ మెయిల్ చేసిన పై అధికారిని పోలీస్ స్టేషన్ కు వెళ్లి చంపేసి యాక్సిడెంట్ అని క్రియేట్ చేస్తారు. ఇక చనిపోయిన అధికారి స్థానంలోకి పరశు అడుగు పెడతాడు. ఆ తర్వాత నుంచి మిగతా వాళ్లకు టార్చర్ మొదలవుతుంది. సైకోలా ప్రవర్తిస్తూ తన కింది స్థాయి వాళ్లను టార్చర్ చేస్తాడు. ఇందులో హీరో పేరు సదా. అతను ఒక నాటు వైద్యుడు. అయితే కుంటి కాలితో ఉండే సదా అసలు తన కాలికి ఏమైంది ? తన గతం ఏంటి అనే విషయాలపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఎవరితో ఏమీ చెప్పడు. ఓ రోజు బస్ స్టాప్ లో ఓ అమ్మాయిని చూస్తాడు. ఆ తర్వాత రెస్టారెంట్లో కలిసి ఆ అమ్మాయి పేరు సూర్య అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన పరుశు వీరిద్దరూ మాట్లాడుకోవడం చూసి పరశు అసూయ పడతాడు. ఇక మరోవైపు ఒకే ఏరియాలో నివాసం ఉండే హీరో హీరోయిన్లు ఇద్దరూ తరచుగా కలుస్తారు. కానీ విలన్ పరుశు హీరోయిన్ కి దగ్గర అవ్వాలని ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ కేమో హీరో నచ్చుతాడు. ఎక్కువగా ఆమె హీరోతోనే టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది. ఇక ఒకానొక క్రమంలో హీరో హీరోయిన్ తో పాటు పరశుకు కూడా ఓ గతం ఉందనే విషయం తెలుస్తుంది. కళ్ళ ముందే తన భార్య ఆత్మ హత్య చేసుకుంటున్నా కూడా అతడేమో  మందు తాగుతూ దాన్ని ఎంజాయ్ చేస్తాడు ఇన్స్పెక్టర్ పరశు. అసలు అతను ఎందుకలా చేశాడు ? పరశుకు సదాకు మధ్య ఉన్న లింక్ ఏంటి ? హీరో గతం ఏంటి ? హీరోయిన్ గతం ఏంటి ? మరి చివరికి హీరో హీరోయిన్లు ఒకటయ్యారా ? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని వీక్షించాల్సిందే. ఎవరైనా చూడకపోతే ఈ మూవీపై ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు