OTT Movie : తల్లిదండ్రులను హత్య చేసిన రాశి ఖన్నా… సీరియల్ కిల్లర్ ను ఆటాడించే ఈ మూవీని చూశారా?

OTT Movie : రాశి ఖన్నా అనగానే రసగుల్లా లాంటి ఆ బ్యూటీ అందం గుర్తొస్తుంది. కానీ ఆమె కిల్లర్ గా మారితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీని చూస్తే తెలుస్తుంది. స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశి ఖన్నా ప్రస్తుతం ఓటిటి సిరీస్ లతో కూడా అదరగొడుతోంది. మరి ఈ బ్యూటీ నటించిన ఆ సైకో కిల్లర్ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీలో రాశి ఖన్నా ఎవ్వరూ ఊహించని నెగిటివ్ షేడ్ ఉండే పాత్రలో నటించింది. అప్పటిదాకా కేవలం గ్లామర్ డాల్ గా అదరగొట్టిన రాశి ఖన్నా డేరింగ్ రోల్ చేసి అందరిని మెస్మరైజ్ చేసింది. నెగిటివ్ షేడ్ ఉన్న లేడీ విలన్ తరహా పాత్రను పోషించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ సిరీస్ కూడా బాగానే ట్రెండ్ అయ్యింది. సైకో కిల్లర్ ని వెంటాడే ఒక పోలీస్ ఆఫీసర్ కి ఈ బ్యూటీ చేసే పని కీలకంగా మారుతుంది. మనం చెప్పుకుంటుంది మూవీ గురించి కాదు. వెబ్ సిరీస్ గురించి. ఆ వెబ్ సిరీస్ పేరు రుద్ర. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రను పోషించారు.

Rudra actress rashi Khanna marriage divorce, know about Ajay Devgan Esha  Deol Costar who debut on OTT Web Series - ईशा देओल और अजय देवगन संग ओटीटी  पर डेब्यू से चर्चा में

- Advertisement -

ఈ సిరీస్ స్టోరీ ఏంటంటే?

రుద్ర వెబ్ సిరీస్ లో అజయ్ దేవగన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. అతను ఓ సైకో కిల్లర్ ని వెంటాడుతుంటే రాశి ఖన్నా అతడిని వెంటాడుతుంది. కానీ అప్పటికే రాశి ఖన్నా తల్లిదండ్రులను హత్య చేసిన అమ్మాయిగా ముద్ర వేసుకుంటుంది. అయితే ఆమె చాలా తెలివిగలది. తను చేసే నేరాలన్ని ఎవరూ గుర్తుపట్టకుండా కావలసిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అంటే ఆమె నేరం చేసినప్పటికీ ఒక్క ఆధారం కూడా దొరకదు అన్నమాట.

ఏఎ నేపథ్యంలో ఓ కేసును అజయ్ దేవగన్ కు పోలీస్ శాఖ అప్పగిస్తుంది. ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో అజయ్ దేవగన్ ఈ కేసును క్లోజ్ చేయడానికి గట్టిగానే కష్టపడాల్సి వస్తుంది. ఒక్క క్లూ దొరికినా వెంటనే రాశి ఖన్నా దాన్ని నాశనం చేస్తుంది. కానీ హీరో చేసే ఇన్వెస్టిగేషన్ నచ్చి అతని ఇష్టపడుతుంది. అజయ్ దేవగన్ మాత్రం అప్పటికే పెళ్లయి, విడాకులు కోరే భార్యతో జీవితం గడుపుతూ ఉంటాడు. పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాశి ఖన్నాను మాత్రం దూరం పెడతాడు. ఈ నేపథ్యంలోనే ఒక సైకో కిల్లర్ స్టోరీలోకి ఎంటర్ అవుతాడు. రాశి ఖన్నా నుంచి పోలీస్ ఎలా తప్పించుకున్నాడు? ఆ సీరియల్ కిల్లర్ ను పట్టుకోగలిగాడా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే రుద్ర సిరీస్ ను చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు