OTT Movie : వరస మర్డర్స్ తో మతి పోగొట్టే సైకలాజికల్ మర్డర్ మిస్టరీ… ఏ ఓటీటిలో చూడొచ్చంటే?

OTT Movie : పర్టికులర్ గా మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కోసం వెతికే వారి కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. అయితే ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన కొత్త మూవీ కాదు గాని సినిమాలో ఉండే ట్విస్టులు మాత్రం మతి పోగొట్టేలా ఉంటాయి. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఈ మూవీ ని ఇప్పటికి కూడా బెస్ట్ ఇన్వెస్టిగేటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల లిస్టులో ముందు వరుసలో ఉంటుందని చెప్పుకుంటారు మూవీ లవర్స్. కాబట్టి మిస్ చేయకుండా చూడాల్సిన ఈ మర్డర్ మూవీ అందుబాటులో ఉంది? స్టోరీ ఏంటి అనే విషయాలను చూసేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఈ మూవీ 1995లో రిలీజ్ అయింది. అప్పుడు సూపర్ హిట్ అనిపించుకున్న ఈ మూవీ ఇప్పటికీ కూడా థ్రిల్లర్ సినిమాల లిస్టులో ముందు వరసలో ఉంది. కరెక్ట్ గా సోమవారం స్టార్ట్ అయ్యి ఆదివారంతో ముగుస్తుంది మూవీ. అంటే సినిమాలో వారం రోజుల పాటు స్టోరీ నడుస్తుందన్నమాట. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Se7en Gluttony scene

- Advertisement -

స్టోరీ లోకి వెళ్తే…

ఇందులో సోమర్ అనే వ్యక్తి డిటెక్టివ్ గా పని చేస్తాడు. ఈ సోమర్ ఓ హత్యను ఇన్వెస్టిగేట్ చేస్తుండగా ఇదే కేసులో మిల్స్ అనే మరో డిటెక్టివ్ కూడా జాయిన్ అవుతాడు. కానీ డిటెక్టివ్ సోమర్ కి ఇదే లాస్ట్ కేస్ కావడంతో ఎలాగైనా సాల్వ్ చేయాలని అనుకుంటాడు. అంతలోపే ఇద్దరికీ మరో చోట మర్డర్ జరిగిందని ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే ఓ వ్యక్తి దారుణమైన స్థితిలో కాళ్లు చేతులు కట్టేసి చనిపోయి ఉంటాడు. దీంతో ఇద్దరు కలిసి ఫ్రెష్ గా ఈ కేసును ఎంక్వయిరీ చేయడం మొదలు పెడతారు. అయితే ఇందులో ఒక సీనియర్ మరొకరు జూనియర్ కావడంతో కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఒకానొక టైంలో ఈ కేసును మిల్స్ కే ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మరో దారుణమైన మర్డర్ జరుగుతుంది. ఆ కేసును కూడా మిస్ చేసుకుంటాడు. సోమర్ వారంలో రిటైర్ అయిపోతాను అనే కారణంతో ఈ విషయాలను సీరియస్ గా తీసుకోడు. కానీ పై అధికారుల ఆదేశాలతో మళ్లీ రెండు హత్యలపై ఫోకస్ చేస్తాడు. మొత్తానికి బైబిల్ లోని ఏడు అంశాల ఆధారంగా ఈ వరుస హత్యలు జరిగాయని తెలుసుకుంటారు. అంతేకాకుండా మరో ఐదు హత్యలు చేయబోతున్నారని కూడా అర్థమవుతుంది. మరి వీరిద్దరూ ఈ అయిదు హత్యలను ఆపగలిగారా? కిల్లర్ ఎందుకిలా వరుస హత్యలు చేస్తున్నాడు? ఆ బైబిల్లో ఏముంది? అనే విషయాలు తెలియాలంటే సెవెన్ అనే ఈ సినిమాపై ఒక లుక్ వేయండి. ఇదొక పాత మూవీనే  అయినప్పటికీ స్టోరీ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.  కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇస్టపడే వారికి ఇదొక బెస్ట్ సజెషన్ తప్పకుండా ఈ వీక్ సెవెన్ అనే ఈ సినిమాను చూసేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు