OTT Movie : అమ్మాయిలే కదా ఏం చేస్తారు అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మూవీని చూస్తే మైండ్ బ్లాకే

OTT Movie : ఓటిటిలో ప్రతి వారం ఎన్నో సినిమాలు వస్తాయి. కానీ ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఇచ్చేది మాత్రం కొన్ని సినిమాలే. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని చూసాము అనే అనుభూతినిచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఓటిటిలో వందల సంఖ్యలో సినిమాలు ఉన్నప్పటికీ ఇలాంటి వాటిని వెతికి పట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీనీ అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా తప్పకుండా చూసి తీరాల్సిందే. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ టైటిల్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రైమ్ వీడియోలో అందుబాటులో..

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది. పైగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే కోవకు చెందిన ఈ మూవీని చూసాక ఇప్పటి తరం అమ్మాయిల జీవితాలు ఎలా ఉన్నాయి? వాళ్లు ఏం కోల్పోతున్నారు? కొత్త తరం పిల్లలు తల్లిదండ్రులను ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? ఇప్పటి ఫ్యామిలీలలో ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి? దాంపత్యం ఎలా ఉంటోంది? అనే విషయాలను క్లియర్ గా చూపించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా పేరు శర్మా జీకి బేటీ. అయితే ఈ మూవీ హిందీలో మాత్రమే అందుబాటులో ఉండడం తెలుగు మూవీ లవర్స్ ని కాస్త ఇబ్బంది పెట్టే విషయం. అయితే భాషతో పనేముంది కంటెంట్ బాగుంటే చాలు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. మనసుకు హత్తుకునేలా మూడు తరాల మహిళల జీవితాలను తెరపై చూపించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Sharmajee Ki Beti review: Netizens, critics give thumbs-up to Tahira Kashyap's directorial debut on Amazon Prime video | Today Newsస్టోరీ ఏంటంటే…

ముందుగా హౌస్ వైఫ్ గురించి చూపిస్తారు. ఆమె తన కుటుంబం గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతుంది. కానీ భర్త మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోడు. కనీసం కొన్ని నిమిషాలు కూడా ఆమెతో మాట్లాడే ఆలోచనలో ఉండడు. ఆ తర్వాత మరో క్యారెక్టర్ తల్లి ఎంట్రీ ఇస్తుంది. కాలేజ్ లో లెక్చరర్ గా పని చేసే ఈమెకు ఒక కూతురు ఉంటుంది. పేరుకే కూతురు గాని తల్లి అంటే కనీసం గౌరవం, మర్యాద అనేవి ఉండవు. పైగా తల్లే జీవితాన్ని నాశనం చేస్తుందని ఆ పిల్ల ఫీలవుతూ ఉంటుంది. నెక్స్ట్ పాత్ర ఒక అమ్మాయి. ముంబై క్రికెట్ టీంలో ఆడుతూ ఉండే ఈ అమ్మాయిని ప్రియుడు క్రికెట్ మానేయాలని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఎంకరేజ్ చేయడం పక్కన పెట్టి చులకన చేస్తూ మాట్లాడతాడు. మరి ఈ ముగ్గురు మహిళలు తమ జీవితాలను ఎలా చక్కదిద్దుకున్నారు ? తమ సమస్యలను ఎలా తీర్చుకున్నారు ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే శర్మా జీకి బేటీ అనే ఈ మూవీని చూసి తీరాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలే కదా ఏం చేస్తారు అని ఫీల్ అయ్యేవారు డోంట్ మిస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు